టెక్స్‌టైల్స్‌ రంగంలో విస్తారమైన అవకాశాలు: మంత్రి కేటీఆర్

228
ktr
- Advertisement -

టెక్స్‌టైల్స్ రంగం లో పెట్టుబడులకు తెలంగాణలో అనేక అవకాశాలు ఉన్నాయని పరిశ్రమల శాఖ మంత్రి కే తారకరామారావు అన్నారు. ఈరోజు ఇన్ వెస్ట్ ఇండియా నిర్వహించిన టెక్స్టైల్ అప్పారెల్ ఇన్వెస్ట్మెంట్ మీట్ లో మంత్రి కేటీఆర్ కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ తో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్రానికి టెక్స్టైల్ మరియు అప్పారెల్ రంగంలో ఉన్న సానుకూలతలను మంత్రి వివరించారు.

తెలంగాణలో ఇప్పటికే 60 లక్షల ఎకరాల్లో పత్తి పంట సాగు కొనసాగుతుందని ఈ సందర్భంగా మంత్రి గుర్తుచేశారు. తెలంగాణ లో లభించే పత్తి దేశంలోనే కాకుండా అంతర్జాతీయంగా కూడా అద్భుతమైన నాణ్యత కలిగినదని దక్షిణ భారత మిల్స్ అసోసియేషన్ ప్రకటించిన విషయాన్ని ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ ఇన్వెస్టర్లకు గుర్తు చేశారు.తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు వచ్చే పెట్టుబడిదారులకు ప్రభుత్వం అన్ని రకాలుగా అండగా ఉంటుందని, సాదర స్వాగతం పలుకుతుందని తెలిపారు. ముఖ్యంగా తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ts-ipass ద్వారా అత్యంత తక్కువ సమయంలో 15 రోజుల్లోనే కావలసిన అన్ని అనుమతులు లభిస్తాయని తెలిపారు.

తెలంగాణ ప్రభుత్వం సానుకూల పారిశ్రామిక విధానాల వలన ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ర్యాంకుల్లో అగ్రస్థానంలో కొనసాగుతున్నట్లు మంత్రి తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం పరిశ్రమలకు సైతం ఎలాంటి అంతరాయం లేకుండా విద్యుత్ సరఫరా చేస్తుందని, దీంతో పాటు మిషన్ భగీరథ కార్యక్రమంలో భాగంగా పరిశ్రమలకు 10 శాతం నీటిని కేటాయించిందనీ, ఇందుకు సంబంధించిన పైప్లైన్లు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో ఉన్నాయని గుర్తు చేశారు. తెలంగాణలో కావలసిన పరిశ్రమలకు కావలసిన సిబ్బంది కోసం తెలంగాణ ప్రభుత్వమే స్వయంగా సొంత కర్చుతో శిక్షణ ఇస్తున్న అంశాన్ని అంశాన్నీ ఈ సందర్భంగా మంత్రి ఇన్వెస్టర్లకు తెలిపారు.

తెలంగాణ ప్రభుత్వం తీసుకువచ్చిన తెలంగాణ టెక్స్టైల్ మరియు అప్పారెల్ పాలసీ పరిశ్రమలోని వివిధ వర్గాలతో మాట్లాడిన తర్వాత పరిశ్రమకు కావాల్సిన అంశాలను క్రోడీకరించి తయారు చేసినట్లు మంత్రి కేటీఆర్ తెలిపారు. గత ఆరు సంవత్సరాలుగా తెలంగాణ ప్రభుత్వం టెక్స్టైల్ మరియు వ్యాపార రంగాన్ని ఒక ప్రాధాన్యత రంగంగా గుర్తించిన నేపథ్యంలో ఈ రంగంలో అనేక పెట్టుబడులు వచ్చినట్లు మంత్రి కేటీఆర్ ఇన్వెస్టర్లకు తెలిపారు. దేశంలోని ఇతర రాష్ట్రాల మాదిరి ప్రోత్సాహకాలు విషయంలో పెట్టుబడిదారులకు టైలర్ మేడ్ పాలసీ అందించేందుకు అవసరమైన సదుపాయం ప్రభుత్వానికి ఉన్నదన్నారు.

ఇన్వెస్ట్మెంట్ సమ్మిట్లో తెలంగాణలో తమ పరిశ్రమ యొక్క ఏర్పాటు మరియు అనుభవాన్ని వివరించిన వెల్స్పన్ సీఈవో దీపాలి గోయంక, తెలంగాణలో పరిశ్రమలు నడిపేందుకు అత్యంత అనుకూలమైన రాష్ట్రం అని చెప్పారు. టీఎస్ ఐపాస్ వంటి విధానాలు క్షేత్ర స్థాయిలోనూ పని చేస్తున్న విషయాన్ని ఆమె తెలియజేశారు.తెలంగాణలో ప్రభుత్వంలో ఉన్న నాయకత్వం అత్యంత దీర్ఘకాల దృక్పథం కలిగి ఉన్న పరిశ్రమ ఫ్రెండ్లీ నాయకత్వం అని ఆమె తెలియజేశారు. తెలంగాణ రాష్ట్రానికి వచ్చే పెట్టుబడుల కి ఎలాంటి ఇబ్బంది ఉండదని ఈ సందర్భంగా ఆమె తన అనుభవాలను వివరించారు.

తెలంగాణ ప్రభుత్వం గత ఆరు సంవత్సరాలుగా తనదైన విధానాలతో, నాయకత్వంతో పెట్టుబడుల ఆకర్షణలో పోటీ పడుతుందని కేంద్ర మంత్రి స్మృతి ఇరాని అన్నారు. ఇతర రాష్ట్రాలతో పోటీగా ఇచ్చే పాలసీలు మరియు ప్రోత్సాహకాల విషయంలో మంత్రి కేటీఆర్ ఈరోజు చేసిన ప్రసంగాన్ని ఆమె అభినందించారు. ఇతర రాష్ట్రాలతో పాటు లేదా ఇతర రాష్ట్రాలకు మించి అవసరమైన సౌకర్యాలు కల్పించేందుకు సిద్ధంగా ఉన్నామని మంత్రి కేటీఆర్ చేసిన ప్రకటనను ఆమె ఈ సందర్భంగా ప్రత్యేకంగా ప్రస్తావించారు.

రాష్ట్రాల మధ్య ఇలాంటి స్నేహపూర్వక పోటీ వాతావరణాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కాంపిటీటివ్ ఫెడరలిజం గా ప్రస్తావిస్తారని తెలిపారు. భారతదేశంలో విస్తారమైన అవకాశాలు టెక్స్టైల్ మరియు రంగంలో ఉన్నట్లు ఆమె పెట్టుబడిదారులకు సూచించారు. దేశంలోని ఏ రాష్ట్రంలో అయినా పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చే వారికి కేంద్ర ప్రభుత్వం తరఫున మరియు ఇన్వెస్ట్ ఇండియా తరఫున పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని హామీ ఇచ్చారు. దేశంలోని టెక్స్టైల్ పరిశ్రమ ప్రస్తుత కోవిడ్ సంక్షోభాన్ని ఒక అవకాశంగా ఉపయోగించుకొని మొన్నటి వరకు తయారు పీపీ ఈ కిట్లు తయారు చేయలేని పరిస్థితి నుంచి ప్రస్తుతం ప్రపంచంలోనే అత్యధికంగా పీపీ ఈ కిట్లు తయారు చేస్తున్న 2 వ దేశంగా నిలిచేలా చేశారనీ పరిశ్రమ వర్గాలను అభినందించారు.తెలంగాణలో ఉన్న ప్రభుత్వం పాలసీలను మరియు పలు ఇతర అంశాలను ఈ సందర్భంగా పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్ ఒక పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా పెట్టుబడిదారులకు వివరించారు

- Advertisement -