భారీ వర్షాలు..అధికారుల సెలవులు రద్దు

177
ktr
- Advertisement -

తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. మరో రెండు రోజులు వర్షాలు పడే అవకాశం ఉండటంతో ఆస్తి, ప్రాణ నష్టం లేకుండా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు మంత్రి కేటీఆర్.

ఈ మేరకు వర్షాలపై సమీక్ష నిర్వహించిన కేటీఆర్….మున్సిపల్ అధికారులకు సెలవులు రద్దు చేస్తున్నట్లు తెలిపారు. క్షేత్రస్ధాయిలో ప్రజలకు అందుబాటులో ఉండాలని..అధికారులు ఎప్పటికప్పుడు పరిస్ధితిని సమీక్షించాలన్నారు.

ప్రస్తుతం సాధారణం కన్నా అధికంగా వర్షపాతం నమోదవుతోందని మంత్రి కేటీఆర్‌కి వివరించారు అధికారులు. ఒక్క హైదరాబాద్‌లోనే గత పది రోజుల్లో 54 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైందని… ఈ స్థాయిలో గతంలో ఎన్నడూ వానలు పడడం లేదని తెలిపారు. వర్షాల వల్ల పాడవుతున్న రోడ్లకు వెంటనే మరమ్మతులు చేయాలని సూచించారు మంత్రి కేటీఆర్‌.

- Advertisement -