ఓటుతో బీజేపీకి గుణపాఠం చెప్పండి: హరీశ్‌ రావు

141
harish

ఓటుతో బీజేపీకి గుణపాఠం చెప్పాలన్నారు మంత్రి హరీశ్ రావు. సిద్దిపేట జిల్లా దుబ్బాక నియోజకవర్గం పద్మనాభునిపల్లిలో పర్యటించిన హరీశ్ రావు..
బడా కార్పొరేట్‌ ముసుగులో నయా జమీందారు వ్యవస్థకు తెరలేపుతున్న బీజేపీకి దుబ్బాక ప్రజలు బుద్దిచెప్పాలన్నారు.

తనను అసెంబ్లీకి పంపడంలో మొదటి చెయ్యి పద్మనాభునిపల్లె గ్రామస్తులదేనని గుర్తుచేసుకున్నారు. తమ ఓటు కేసీఆర్, టీఆర్ఎస్‌ పార్టీకేనని ముక్తకంఠంతో చెప్పిన గ్రామస్తులకు శిరస్సు వంచి ధన్యవాదాలు తెలుపుతున్నానన్నారు.

గ్రామంలో ఏడాది కిందటే మద్య నిషేధం చేసిన గ్రామస్తులను, యువతను అభినందిస్తున్నానని చెప్పారు. వ్యవసాయాన్ని కార్పొరేటీకరణ చేస్తూ.. మార్కెట్లను రద్దు చేసేందుకు చూస్తున్న బీజేపీ డిపాజిట్లు గల్లంతయ్యేలా దుబ్బాక ప్రజలు తీర్పు చెప్పాలని కోరారు.

అంతకు ముందు ఎల్లమ్మ దేవాలయంలో హరీశ్‌రావు ప్రత్యేక పూజలు నిర్వహించారు. గ్రామ మహిళలు మంగళహారతులు పట్టి, కుంకుమ తిలకం దిద్దారు.