తెలంగాణ భూమి పుత్రుడు..కాళోజీ: కేటీఆర్

115
ktr

తెలంగాణ భూమి పుత్రుడు కాళోజీ అని కొనియాడారు మంత్రి కేటీఆర్. ప‌్ర‌జాక‌వి కాళోజీ తెలంగాణ కోసం తన జీవితాన్ని అంకితం చేశార‌ని అన్నారు. కా‌ళోజీ జ‌న్మ‌దినం సందర్భంగా మంత్రి ట్విట‌ర్ ద్వారా శుభాకాంక్ష‌లు తెలిపారు.

తన కవిత్వంతో స్వరాష్ట్ర ఆకాంక్షను రగిలించార‌ని …మన తెలంగాణ భాషను, యాసలోని మాధుర్యాన్ని తన రచనలతో ఎలుగెత్తి చాటార‌ని కొనియాడారు. భాష రెండు విధాలుగా ఉంటుంద‌ని, ఒకటి బడి పలుకుల భాష, రెండోది పలుకుబడుల భాష అని.. పలుకుబడుల భాష కావాల‌ని చెప్పిన‌ తెలంగాణ వైతాళికుడు కాళోజీ అని అన్నారు.