ప్రజల గొంతుక కాళోజీ: సీఎం కేసీఆర్

100
kaloji

ప్రజల గొంతుకగా జీవితాంతం బతికిన కాళోజీనారాయణ రావు ఎన్నిటికీ చిరస్మరణీయుడే అని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అన్నారు. ప్రజాకవి కాళోజీ నారాయణ రావు జయంతి సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ ఆయనకు నివాళి అర్పించారు. ప్రజల్లో చైతన్య దీప్తి వెలిగించడానికి ఆయన ధైర్యంగా నిలబడే వారని చెప్పారు.

ఈ కార్యక్రమంలో స్పీకర్ శ్రీ పోచారం శ్రీనివాస రెడ్డి గార, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి,మంత్రులు శ్రీ కేటి రామారావు, శ్రీ ఈటెల రాజేందర్, శ్రీనివాస్ గౌడ్, పువ్వాడ అజయ్ కుమార్, డిజీపి మహేందర్ రెడ్డి, లెజిస్లేటివ్ సెక్రటరీ డా. వి. నరసింహా చార్యులు, పలువురు శాసనసభ్యులు పాల్గొన్నారు.