కోటి 12 లక్షల ఢీల్…ఏసీబీకి పట్టుబడ్డ అడిషనల్ కలెక్టర్ నగేష్

236
nagesh

ఏసీబీ చేతికి మరో అవినీతి తిమింగళం చిక్కింది.మెదక్ అడిషినల్ కలెక్టర్ నగేష్‌ ఇంట్లో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. మెదక్ జిల్లా నర్సాపూర్ మండలం చిప్పల్ పర్తి గ్రామంలో 110 ఎకరాల రికార్డు క్లియర్ చేసిందుకు భారీ ఢీల్ చేసుకున్నారు.

కోటి 10లక్షలు ఢిల్ కుదుర్చుకోగా ఏసీబికి అందిన ఫిర్యాదుతో అడిషినల్ కలెక్టర్ నగేష్ ఇంట్లో సోదాలు, పలు పత్రాలు స్వాధీనం చేసుకున్నారు. ఆయన ఇంట్లో ఇంకా తనిఖీలు కొనసాగుతున్నాయి. ఈ ఢీల్‌తో పలువురు అధికారులకు సంబంధాలు ఉన్నట్లు ఏసీబీ అధికారులు గుర్తించారు. నగేష్‌కు సంబంధించిన ఆడియో క్లిప్‌తో పాటు చెక్కు,ప్రాపర్టీని అగ్రిమెంట్‌ని స్వాధీనం చేసుకున్నారు.