టీఆర్ఎస్…తిరుగులేని రాజకీయ శక్తి

25
minister

తెలంగాణ రాష్ట్ర ప్రజల ఆకాంక్షల సాకారం కోసం సీఎం కేసీఆర్ నాయకత్వంలో టీఆర్ఎస్ ప్రభుత్వం అందిస్తున్న అద్భుతమైన పాలనకు, ప్రజలు ప్రతి ఎన్నికలోనూ పట్టం కడుతున్నార‌ని పేర్కొన్నారు మంత్రి కేటీఆర్. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నిక‌ల్లో ప‌న్నెండుకు 12 స్థానాల‌ను టీఆర్ఎస్ పార్టీ గెలుచుకోవడం ద్వారా టీఆర్ఎస్ పార్టీ అంటే తిరుగులేని రాజకీయ శక్తి అని మరోసారి నిరూపితమైంద‌న్నారు.

విజయం సాధించిన టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులకు శుభాకాంక్ష‌లు తెలిపారు. టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులకు ఓటు వేసి గెలిపించిన స్థానిక సంస్థల ప్రతినిధులంద‌రికీ మంత్రి కేటీఆర్ ధన్యవాదాలు తెలిపారు. టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత చేపట్టిన అనేక వినూత్న కార్యక్రమాలతో స్థానిక సంస్థలు ఎంతగానో బలోపేతమయ్యాయయని, ముఖ్యంగా పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి ద్వారా స్థానిక సంస్థలకు ప్రతినెల టంచన్ గా నిధులను అందిస్తూ స్థానిక సంస్థలను ఆర్థికంగానూ బలోపేతం చేస్తున్నామన్నారు.