బంగార్రాజు..స్పెషల్ సాంగ్‌లో ఫరియా అబ్దుల్లా

26
nag

కింగ్ అక్కినేని నాగార్జున, యువసామ్రాట్ నాగచైతన్య, రమ్యకృష్ణ, కృతి శెట్టి కాంబినేషన్‌లో రాబోతోన్న బంగార్రాజు సినిమా మీద మంచి అంచనాలు ఏర్పడ్డాయి. కళ్యాణ్ కృష్ణ కురసాల దర్శకత్వంలో రాబోతోన్న ఈ మూవీ ప్రమోషన్ కార్యక్రమాలను వేగ‌వంతం చేశారు.

అనూప్ రూబెన్స్ సంగీత సారథ్యంలో ఇది వరకే విడుదల చేసిన లడ్డుండా, నా కోసం పాటలకు విశేషమైన స్పందన లభించింది. ఇక ఇప్పుడు పార్టీ సాంగ్ ఆఫ్ ది ఇయర్ అంటూ మూడో పాటతో అలరిచేందుకు ముందుకు వచ్చారు. త్వరలోనే ఈ మూడో రాబోతోంది. ఇందులో భాగంగా డిసెంబర్ 17న సాంగ్ టీజర్ కూడా రాబోతోంది. జాతి రత్నాలు ఫేమ్ ఫరియా అబ్దుల్లా ఈ స్పెషల్ సాంగ్‌లో నాగార్జున, నాగ చైతన్యల సరసన స్టెప్పులు వేశారు.

మొదటి సారిగా మ్యూజిక్ కాన్సెప్ట్ పోస్టర్‌ను విడుదల చేసి అందరినీ ఆశ్చర్యపరిచారు. ఈ పోస్టర్‌ ద్వారా సాంగ్ ఎలా ఉండబోతోందో హింట్ ఇచ్చేశారు. ఇక ఇందులో అక్కినేని తండ్రీ కొడుకులిద్దరూ ఫరియా అబ్దుల్లాతో కలిసి చిందులు వేయనున్నారు. నాగార్జున పంచెకట్టులో కనిపిస్తుండగా.. నాగ చైతన్య మోడ్రన్ లుక్‌లో ఆకట్టుకున్నారు. ఇక ఫరియా మాత్రం ఆటంబాంబ్‌లో కనిపిస్తున్నారు.

అక్కినేని కుటుంబానికి చిరకాలం గుర్తుండిపోయే సినిమా మనం. అందులో నాగార్జున, యువ సామ్రాట్ నాగ చైతన్య కలిసి నటించారు. మళ్లీ ఇప్పుడు సోగ్గాడే చిన్ని నాయన సినిమాకు ప్రీక్వెల్‌గా రాబోతోన్న ఈ ‘బంగార్రాజు’ చిత్రంలో కలిసి నటిస్తున్నారు. ప్రస్తుతం బంగార్రాజు షూటింగ్ జరుగుతోంది. అన్నపూర్ణ స్టూడియోస్ ప్రై.లి., జీ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి నాగార్జున నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. సత్యానంద్ స్క్రీన్ ప్లేను అందిస్తుండగా.. సినిమాటోగ్రఫర్‌గా యువరాజ్ పని చేస్తున్నారు.

నటీనటులు : అక్కినేని నాగార్జున, నాగ చైతన్య, రమ్యకృష్ణ, కృతి శెట్టి, చలపతి రావు, రావు రమేష్, బ్రహ్మాజి, వెన్నెల కిషోర్, ఝాన్సీ

సాంకేతిక బృందం

కథ, దర్శకత్వం: కళ్యాణ్ కృష్ణ
నిర్మాత: అక్కినేని నాగార్జున
బ్యానర్స్: జీ స్టూడియోస్, అన్నపూర్ణ స్టూడియోస్ ప్రై.లి.
స్క్రీన్ ప్లే: సత్యానంద్
సంగీతం: అనూప్ రూబెన్స్
సినిమాటోగ్రఫర్: యువరాజ్
ఆర్ట్ డైరెక్టర్: బ్రహ్మ కడలి
పీఆర్వో : వంశీ-శేఖర్