ఐజ మండల అభివృద్ధికి సహకరిస్తాం: కేటీఆర్

51
ktr

జోగులాంబ గద్వాల్ జిల్లా ఐజ మండల అభివృద్ధికి అన్నివిధాలా సహకరిస్తానని తెలంగాణ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి తారక రామారావు అన్నారు. బుధవారం అలంపూర్ ఎమ్మెల్యే అబ్రహంతో కలిసి అయిజ మండల టీఆర్‌ఎస్‌ నాయకులు ఉప్పల ఎంపీటీసీ ప్రహాలాద్‌ రెడ్డి, సిందనూర్ ఎంపీటీసీ రవిరెడ్డి , మేడికొండ మాజీ సర్పంచ్ వెంకటేశ్‌లు ప్రగతి భవన్‌లో మంత్రి కేటీఆర్‌ను కలిశారు.

ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్‌ మండలాన్ని అన్నివిధాలా అభివృద్ధి చేస్తామని వారికి హామీ ఇచ్చారు. టీఆర్‌ఎస్‌ ప్రతి ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు ఎమ్మెల్యే అబ్రహం నాయకత్వాన్ని మరింత బలపరచాలని సూచించారు. అందరూ కలిసికట్టుగా పార్టీని మరింత ముందుకు తీసుకెళ్లాని చెప్పారు. అనంతరం వారు మంత్రి కేటీఆర్‌కు పుష్పగుచ్ఛం ఇచ్చి కృతజ్ఞతలు తెలిపారు.