వరంగల్‌ని సుందరంగా తీర్చిదిద్దుతాం: ఎర్రబెల్లి

43
dayakar

వరంగల్ అభివృద్ధికి ప్రభుత్వం ఎనలేని కృషి చేస్తున్నది…వరంగల్ మహానగరం రాష్ట్రానికి రెండో రాజధానిగా వెలుగొందుతున్నది వరంగల్ మహా నగరాన్ని ప్రణాళికా బద్ధంగా పకడ్బందీగా నిర్మించేందుకు సీఎం కెసిఆర్, మంత్రి కేటీఆర్ లు కంకణ బద్దులై ఉన్నారని తెలిపారు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు. నగరాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతున్నారని తెలిపారు.

గ్రేటర్ వరంగల్ కార్పొరేషన్ లో పాలక వర్గ సమావేశ మందిరాన్ని ప్రారంభించిన అనంతరం మాట్లాడిన ఎర్రబెల్లి…రూ.8కోట్ల వ్యయంతో నిర్మించిన భవనం,వరంగల్ మహా నగర పాలక సంస్థ లో గాంధీ విగ్రహాన్ని ఆవిష్కరించారు. జనవరి 26వ తేదీన అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించనున్నట్లు ప్రకటించారు మేయర్.

ఈ సందర్భంగా మాట్లాడిన ఎర్రబెల్లి…మౌలిక సదుపాయాలు, డ్రైనేజ్, సెంట్రల్ లైటింగ్, పార్కులు వంటి సదుపాయాలతో ఆహ్లాదకరమైన నగరంగా ఉంది..ప్రతి ఏటా ప్రభుత్వం 300 కోట్లు వరంగల్ కోసం బడ్జెట్ కేటాయిస్తున్నది…గతానికి ప్రస్తుతానికి ఎంటి తేడా ఉందన్నారు. గతంలో ప్రభుత్వాలు కార్పొరేషన్లకు డబ్బులు, బడ్జెట్ కేటాయించే వారు కాదు…ఇప్పుడు నేరుగా ప్రభుత్వం అనేక నిధులు ఇస్తుందన్నారు.