చత్రపతి శివాజీ సేవలు అనిర్వచనీయం- మంత్రి అల్లోల

24
minister ik reddy

చత్రపతి శివాజీ మహరాజ్ సేవలు అనిర్వచనీయమని రాష్ట్ర మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. ఛత్రపతి శివాజీ 391వ జయంతి సందర్భంగా మంత్రి నిర్మల్ శివాజీ చౌక్ లోని శివాజీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. దేశంలో గొప్ప రాజుగా కీర్తి పొందిన రాజు,స్ఫూర్తి ప్రధాత శివాజీ మహారాజ్‌ అని అన్నారు. ఆయన చేసిన సేవలు ప్రజలు ఎప్పటికీ మరచిపోరని మంత్రి అన్నారు.

ఆయన సేవలను నిత్యం తలుచుకుంటూ.. ఆయనను స్ఫూర్తి ప్రధాతగా భావిస్తారనీ, మనం కూడా ఛత్రపతి సేవలు గుర్తు చేసుకోవడం చారిత్రక అవసరమని అన్నారు.శివాజీ మహరాజ్ ధైర్య సాహసాలు కలవాడని వారి ఆధీనంలో భారతదేశం ఎన్నో విజయాలు సాధించిందని అన్నారు. వారి ధైర్య సాహసాలను ఆదర్శంగా తీసుకొని మనమందరం ఆచరణలో నడవాలని మంత్రి పేర్కొన్నారు.