ఇస్మార్ట్‌ శంకర్‌తో కృతిశెట్టి రొమాన్స్‌..!

39
Hero Ram

టాలీవుడ్‌ ఎన‌ర్జిటిక్ స్టార్ రామ్ హీరోగా లింగుస్వామి డైరెక్ష‌న్‌లో ఓ సినిమా రూపొందుతున్న సంగ‌తి తెలిసిందే.యూట‌ర్న్‌, బ్లాక్ రోజ్‌, సీటీమార్ వంటి చిత్రాల‌ను అందించిన శ్రీనివాసా చిట్టూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమా పూజా కార్య‌క్ర‌మాలు గురువారం హైద‌రాబాద్‌లో జ‌రిగాయి. అయితే తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన వార్త ఒక‌టి సినీ వర్గాల్లో వినిపిస్తోంది.

ఉప్పెన చిత్రంతో తెలుగు ప్రేక్ష‌కుల‌ను ఫిదా చేసిన కృతిశెట్టి..రామ్‌కు జోడీగా న‌టించ‌నున్న‌ట్టు సమాచారం. స్టైలిష్ ఎలిమెంట్స్ తో ఊర‌మాస్‌గా ఈ చిత్రం సాగ‌నున్న‌ట్టు తెలుస్తోంది. తెలుగు, త‌మిళ భాష‌ల్లో తెర‌కెక్క‌నుండ‌గా..కృతిశెట్టి ఈ చిత్రంతో త‌మిళ సినీ ప‌రిశ్ర‌మ‌లోకి ఎంట్రీ ఇవ్వ‌నుంది. అయితే కృతిశెట్టి సెల‌క్ష‌న్‌పై చిత్ర‌యూనిట్ నుంచి అఫీషియ‌ల్ అనౌన్స్ మెంట్ రావాల్సి ఉంది.