పేద ప్రజలకు వరంగా సీఎం సహాయ నిధి- మంత్రి కొప్పుల

22
Minister Koppula

ధర్మపురి నియోజకవర్గంలోని బుగ్గారం, వెల్గటూర్, ధర్మారం,గొల్లపల్లి మండలాలకు మంజూరు అయిన 81 లబ్ధిదారులకు 26,22,500 రూపాయల ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులు శుక్రవారం సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ కరీంనగర్ క్యాంపు కార్యాలయంలో పంపిణీ చేశారు.

వెల్గటూర్ మండలం 33 మంది లబ్ధిదారులకు 12,15,00,ధర్మారం మండలం 23 లబ్ధిదారులకు 6,86,000,బుగ్గారం మండలం 14 లబ్ధిదారులకు 4,04,500, గొల్లపల్లి మండలం 11 లబ్ధిదారులకు 3,16,500 ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా మంజూరు అయిన చెక్కులను పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. అనేకమంది పేద ప్రజలు డబ్బులు లేక ఆస్పత్రుల్లో ప్రాణాలు కోల్పోవడం జరుగుతుంది, కానీ రాష్ట్ర ప్రభుత్వం వారిని దృష్టిలో ఉంచుకుని ముఖ్యమంత్రి సహాయ నిధి క్రింద పేద ప్రజల ప్రాణాలను రక్షిస్తుంది. ధర్మపురి నియోజకవర్గంలో ఎంతో మంది పేద,మధ్య తరగతి ప్రజలకు ముఖ్యమంత్రి సహాయ నిధి వరంగా మారిందని మంత్రి అన్నారు.