గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ టీమ్‌లో మంత్రి హరీష్..

56
minister harish

జిఎస్టీ నుంచి కోవిడ్ రిలీఫ్ మెటీరియల్‌కు రాయితీలు, మినహాయింపులు అంశంపై కేంద్ర ఆర్థిక శాఖ మంత్రుల బృందాన్ని ఏర్పాటు చేసింది. గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ టీమ్‌లో తెలంగాణ ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు చోటు దక్కింది. తాజాగా జరిగిన 43వ జిఎస్టీ కౌన్సిల్‌లో మంత్రుల బృందాన్ని ఏర్పాటు చేయాలని కేంద్రం నిర్ణయించింది. ఈమేరకు మేఘాలయ ముఖ్యమంత్రి కన్రాడ్ కె సంగ్మా కన్వీనర్‌గా మొత్తం 8 మందితో మంత్రుల బృందం ఏర్పాటు జరిగింది. కరోనా వ్యాక్సిన్లు, ఔషధాలు, కోవిడ్ టెస్టు కిట్లతో పాటు కరోనా నియంత్రణలో ఉపయోగించే వస్తువులపై రాయితీలు, మినహాయింపులపై మంత్రుల బృందం సిఫార్సులు చేయనున్నది.