వ్యవసాయశాఖపై సీఎం కేసీఆర్‌ కీలక సమావేశం..

46
cm kcr

శనివారం వ్యవసాయశాఖపై సీఎం కేసీఆర్‌ ప్రగతి భవన్‌లో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహిస్తున్నారు. రానున్న వానాకాలంలో రాష్ట్రంలో పంటల సాగు, విత్తనాలు, ఎరువుల లభ్యత తదితర అంశాలపై సీఎం కేసీఆర్‌ అధికారులతో సమీక్షిస్తున్నారు. వానాకాలం రైతుబంధు నిధులపైనా సమావేశంలో చర్చించే అవకాశం ఉంది. ఈ సమావేశానికి వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్‌ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌ కుమార్‌తోపాటు వ్యవసాయశాఖ, ఆర్థికశాఖ అధికారులు హాజరయ్యారు.