ఆరోగ్య శాఖ అధికారులతో మంత్రి ఈటల సమీక్ష..

199
eatala rajender press meet

టీమ్స్‌, గాంధీ ఆసుపత్రుల్లో అవసరం అయిన సిబ్బంది నియామక ప్రక్రియ ఇప్పటికే కొనసాగుతుంది. ఇంకా ఎంత మంది అవసరం అవుతుందో ఎంపిక ప్రక్రియ వేగవంతం చేయాలని ఆదేశించారు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్. టీమ్స్‌ కొరకు ఎంపికయిన సిబ్బంది జాయిన్ అవుతున్నారని రేపటిలోగా అందరూ జాయిన్ అవుతారని మంత్రి కి వివరించారు అధికారులు. ప్రాధమిక ఆరోగ్య కేంద్రం నుండి, టర్శరే కేర్ ఆస్పత్రి వరకు అవసరం అయిన పరికరాలు కొనుగోలుపై సమీక్ష చేశారు మంత్రి ఈటెల. ఎక్కడ కొరత లేకుండా చూడాలని.. కొనుగోలు ప్రక్రియ వేగవంతం చేయాలని మంత్రి అధికారులకు సూచించారు. వర్షాకాలం సీజన్ మొదలైంది కాబట్టి ,ఇప్పుడు అవసరం అయిన మందులు అన్నీ అందుబాటులో ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలని తెలంగాణ స్టేట్ మెడికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ ఎండీ చంద్రశేఖర్ రెడ్డిని ఆదేశించారు. ఏ ఒక్క ఆసుపత్రు లో కూడా మందులు లేవు అనే వార్త రావొద్దని మంత్రి కోరారు.

కోవిడ్‌ పరీక్షల సంఖ్య గణనీయంగా పెంచిన నేపధ్యంలో చాలా మంది ప్రజలు పరీక్షలు చేయించుకోవడం ముందుకు వస్తున్నారు. అవసరం ఉన్న ప్రతి వ్యక్తికి పరీక్షలు చేస్తామని ప్రకటించారు మంత్రి. ఇందుకోసం 11 సెంటర్లో పరీక్షల కోసం నమూనాలు సేకరిస్తున్నామని తెలియజేశారు. కింగ్ కోటి ఆసుపత్రి, ఫీవర్ ఆసుపత్రి, చెస్ట్ ఆసుపత్రి- ఎర్రగడ్డ, నేచర్ క్యూర్ హాస్పిటల్- అమీర్ పేట్, సరోజినీ దేవి కంటి ఆసుపత్రి- మేహదీపట్నం, ఆయుర్వేద ఆసుపత్రి- ఎర్రగడ్డ, హోమియో పతి ఆసుపత్రి- రామంతపూర్, నిజామియా టీబీ ఆసుపత్రి- చార్మినార్, ఏరియా హాస్పటల్- కొండాపూర్, ఏరియా ఆసుపత్రి- వనస్థలి పురం, నాచారం ఇఎస్‌ఐ ఆసుపత్రి,సరూర్ నగర్ ఇఎస్‌ఐ ఆసుపత్రిలో పరీక్ష కేంద్రాలు అందుబాటులో ఉంటాయని కరోనా లక్షణాలు ఉన్నవారు అక్కడికి వెళ్లి పరీక్షలు చేయించుకోవాలి అని మంత్రి ఈటల రాజేందర్ విజ్ఞప్తి చేశారు.

పరీక్షల కోసం వస్తున్న వారు తప్పని సరిగా మాస్క్ ధరించాలని, పరీక్ష కేంద్రంలో విధిగా భౌతిక దూరం పాటించాలని కోరారు. లేదంటే అవే కరోనా వ్యాప్తి కేంద్రాలుగా మారే ప్రమాదముందని హెచ్చరించారు. ప్రజలు స్వీయ నియంత్రణ పాటించాలని కోరారు. పాజిటివ్ వచ్చిన వారు తక్కువ లక్షణాలు ఉంటే ఇంట్లోనే ఐశోలేశన్ లో ఉండాలని సూచించిన మంత్రి. ఇలా ఉన్నవారికి ఉదయం,సాయంత్రం విధిగా కాల్ సెంటర్ నుండి ఫోన్ చేసి ఆరోగ్య పరిస్థితిని ఆరా తీయాలని అధికారులను ఆదేశించారు. అవసరం ఉన్న వారి దగ్గరకు డాక్టర్స్ నీ పంపించాలని సూచించారు.

ప్రభుత్వ ఆసుపత్రులకు పరీక్షల కోసం, చికిత్స కోసం అడ్మిట్ అయిన ప్రతి పేషంట్ దగ్గరికి డాక్టర్, నర్స్ తప్పకుండా రోజుకి మూడు సార్లు పరీక్ష చేయాలని, పేషంట్ కి ఎప్పుడు అందుబాటులో ఉండేలా చూడాలని డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ డాక్టర్ రమేష్ రెడ్డి నీ ఆదేశించారు. అన్ని జిల్లాల్లో ఉన్న మెడికల్ కాలేజీలో కోవిడ్ పేషంట్లను చేర్చుకునేందుకు రెడీ చేయాలని మంత్రి ఆదేశించారు. హైదరాబాద్ హాస్పిటల్ మీద భారం పడకుండా అక్కడే చికిత్స అందిచేలా చూడాలని కోరారు. కాళోజీ యూనివర్సిటీ విసి డాక్టర్ కరుణాకర్ రెడ్డి, కరోనా నొడెల్ ఆఫీసర్ డాక్టర్ శ్రవణ్ లకు ఈ భాద్యతలు అప్పగించారు. వాటి సన్నద్ధత పై ప్రతి రోజూ రిపోర్ట్ అందజేయాలని కోరారు. జిహెచ్‌ఎంసీ పరిధిలోనే ఎక్కువ కేసులు నమోదవుతున్న నేపధ్యంలో సర్వెలేన్స్ పెంచాలని డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ డాక్టర్ శ్రీనివాస్ నీ ఆదేశించారు. డోర్ టూ డోర్ ఫీవర్ సర్వే ఫ్రీక్వెన్సీ పెంచాలని సూచించారు. కరోనా పాజిటివ్ ఉన్న వ్యక్తి నీ ఎంత తొందరగా గుర్తిస్తే అంత సమర్ధవంతంగా వైరస్ వ్యాప్తి నీ అడ్డుకోవచ్చని అన్నారు.