అమీర్ ఖాన్ ఆఫీస్‌ సిబ్బందికి కరోనా..!

101
ameer khan

కరోనా వైరస్‌ దేశాన్ని కుదిపేస్తోంది. దీని ప్రభావంతో సినీ ప్రముఖులు కూడా సతమతమౌతున్నారు. ఇప్పటికే బాలీవుడ్‌లో చాలా మంది ప్రముఖులు కరోనా బారిన పడ్డారు. తాజాగా సూపర్‌స్టార్‌ అమీర్ ఖాన్ ఇంట్లో కరోనా కలకలం రేపింది. ఇదే విషయాన్ని అమీర్‌ సోషల్ మీడియాలో పంచుకున్నాడు అమీర్. తన సిబ్బందిలో కొందరికి కరోనా వైరస్ సోకినట్లు నిర్ధారించారని తెలియచేశాడు అమీర్. ఈ విషయంపై అమీర్‌ ఓ లేఖ రాశారు.

‘నా స్టాఫ్‌లో కొందరు కరోనా బారిన పడ్డారని తెలియజేస్తున్నాను. కరోనా పాజిటివ్ అని తెలిసిన వెంటనే అందరినీ క్వారంటైన్ చేశారు. సకాలంలో, అత్యంత వేగంగా స్పందించి నా స్టాఫ్‌కు వైద్య సదుపాయాలను కల్పించిన బీఎంసీ (బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్)కి ధన్యవాదాలు. నా సిబ్బంది పట్ల చాలా కేర్ తీసుకున్నారు. అంతేకాకుండా చుట్టుపక్కల ప్రాంతాలను స్టెరిలైజ్ చేశారు.

నా సిబ్బందిలోని మిగిలిన వారికి మాత్రం నెగెటివ్ అని తేలింది. టెస్ట్ చేయించుకోమని మా అమ్మకు చెపుతున్నా. మాకు సంబంధించిన వ్యక్తుల్లో ఆమే చివరి వ్యక్తి. ఆమెకు నెగెటివ్ రావాలని భగవంతుడిని ప్రార్థించండి. కోకిలాబెన్ ఆసుపత్రికి కూడా పెద్ద థ్యాంక్స్. డాక్టర్లు, నర్సులు, ఇతర సిబ్బంది అందిస్తున్న సేవలు చాలా గొప్పవి. టెస్టింగ్ విషయంలో వారు చాలా జాగ్రత్తగా, ప్రొఫెషనల్‌గా వ్యవహరిస్తున్నారు. అందరూ సురక్షితంగా ఉండండి. గాడ్ బ్లెస్ యూ’ అంటూ ఆమిర్ ట్వీట్ చేశారు. ప్రస్తుతం అమీర్ ఖాన్ లాల్ సింగ్ చద్దా అనే చిత్రంలో నటిస్తున్నారు. 1994లో వచ్చిన ఫారెస్ట్ గంప్ అనే హాలీవుడ్ మూవీకి రీమేక్ గా వస్తున్న ఈ చిత్రానికి అద్వైత్ చందన్ దర్శకత్వం వహిస్తున్నారు.