డాక్టర్లు దేవుళ్లతో సమానం: మంత్రి ఈటల

33
etela

గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న నిరుపేదల కోసం ఉచితంగా వైద్య శిబిరాన్ని నిర్వహించటం ఎంతో అభినందనీయమన్నారు మంత్రి ఈటల రాజేందర్. ఎల్‌ఎం కొప్పుల చారిటబుల్ ట్రస్ట్, ప్రతిమ ఫౌండేషన్ సంయుక్త ఆధ్వర్యంలో దొంగతుర్తి ఉన్నత పాఠశాలలో జరిగిన మెగా ఉచిత వైద్య శిబిరానికి మంత్రి కొప్పుల ఈశ్వర్‌తో కలిసి హాజరైన ఈటల…ఫౌండేషన్ ప్రతినిధులను అభినందించారు.

ప్రాణాంతక వ్యాధులతో బాధపడుతున్న రోగుల పాలిట వైద్యులే దేవుళ్లని తెలిపారు. ప్రతిమ ఫౌండేషన్, కొప్పుల చారిటబుల్ ట్రస్ట్ ఇలాంటి సేవా కార్యక్రమాల్ని విస్తృత స్థాయిలో చేపట్టాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో పెద్దపల్లి ఎంపీ బోర్లకుంట వెంకటేష్ నేతతో పాటు పెద్ద సంఖ్యలో ప్రజలు హాజరయ్యారు.