తెలంగాణ డాక్టర్లకు ప్రభుత్వం తీపి కబురు..

45

తెలంగాణలో జూనియర్‌ డాక్టర్ల(జూడాలు)తో ప్రభుత్వం జరిపిన చర్చలు సఫలమయ్యాయి. గురువారం జూడాలతో చర్చలు జరిపిన తర్వాత 15 శాతం స్టైఫండ్‌ పెంచుతూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇవాళ మరోసారి డీఎంఈతో జూడాల చర్చలు జరిగిన తర్వాత జూనియర్‌ డాక్టర్లకు స్టైఫండ్‌ పెంచుతున్నట్లు ప్రభుత్వం పేర్కొంది.

సీనియ‌ర్ రెసిడెంట్ డాక్ట‌ర్ల గౌర‌వ వేత‌నాన్ని రూ. 70 వేల నుంచి రూ. 80,500ల‌కు పెంచుతూ ప్ర‌భుత్వం నిర్ణ‌యం తీసుకున్న‌ది. పెరిగిన స్టైఫండ్ ఈ ఏడాది జ‌న‌వ‌రి 1వ తేదీ నుంచి అమ‌లు కానున్న‌ట్లు ప్ర‌భుత్వం పేర్కొన్న‌ది. దీంతో రెసిడెంట్ డాక్ట‌ర్లు ప్ర‌భుత్వానికి కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు.