సిద్దిపేటలో రోడ్ల మరమ్మత్తులకు రూ.4.50 కోట్లు

47
harish

సిద్దిపేట నియోజకవర్గంలో రహదారుల మరమ్మత్తులకు రూ.4.50 కోట్లు మంజూరైనట్లు తెలిపారు మంత్రి హరీష్ రావు. ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యం కల్పించేలా.. ప్రయాణికులకు ఇబ్బందులు లేకుండా.. రవాణాకు ప్రాధాన్యత ఇస్తున్నామని వెల్లడించారు.

ముస్తాబాద్‌ చౌరస్తా నుంచి గాడిచర్లపల్లి, పుల్లూరు గ్రామాల మధ్య వరకు నాలుగు వరుసల రహదారి మంజూరు చేసుకోగా పనులు తుది దశకు చేరుకున్నాయన్నారు. ముస్తాబాద్‌ రోడ్డులో పుల్లూరు, రాఘవాపూర్‌,లక్ష్మిదేవిపల్లి గ్రామాలను అనుసంధానం చేసి రోడ్డు మరమ్మతులకు 9 కిలో మీటర్లకు రూ. 2 కోట్ల 50 లక్షలు, రాఘవాపూర్‌లో రోడ్డుకు ఇరువైపులా మురికి కాల్వలు నిర్మాణం చేస్తున్నట్లు తెలిపారు.

సిద్దిపేట పట్టణంలోని అంబేద్కర్‌ సర్కిల్‌ నుంచి కరీంనగర్‌ వెళ్లే ప్రధాన రహదారి రంగీలా దాబా చౌరస్తా వరకు మరమ్మతులకు 3 కిలో మీటర్లకు గాను రూ.2 కోట్లు మంజూరు చేస్తున్నట్లు చెప్పారు.