తెలంగాణ కీర్తి కిరీటంలో మ‌రో క‌లికితురాయి

141
Errabelli Dayakar Rao

తెలంగాణ రాష్ట్ర కీర్తి కిరీటంలో మ‌రో క‌లికితురాయి చేరింది. దేశంలో వంద శాతం న‌ల్లా క‌నెక్ష‌న్లు ఇచ్చిన రాష్ట్రంగా తెలంగాణ అవ‌త‌రించింది. ఈ సందర్భంగా కేంద్ర జ‌ల‌శ‌క్తి మంత్రి గ‌జేంద్ర సింగ్ షెకావ‌త్ ట్విట్టర్‌లో ట్వీట్ చేస్తూ తెలంగాణ రాష్ట్రానికి అభినంద‌న‌లు, శుభాకాంక్ష‌లు తెలిపారు.తెలంగాణ త‌ర‌హాలోనే వంద శాతం న‌ల్లా క‌నెక్ష‌న్లు ఇచ్చిన రాష్ట్రంగా గోవా నిలిచింది

త‌ర్వాత స్థానాల్లో పాండిచ్చేరి (87.32%), హ‌రియాణ (85.11%), అండ‌మాన్ నికోబార్ దీవులు (83.76%),ఆరో స్థానంలో గుజ‌రాత్ (81.63%) రాష్ట్రం నిలిచింది. ఈ సందర్భంగా కేంద్ర జ‌ల‌శ‌క్తి మంత్రి గ‌జేంద్ర సింగ్ షెకావ‌త్ కి కృత‌జ్ఞ‌త‌లు, ధ‌న్య‌వాదాలు తెలిపారు రాష్ట్ర పంచాయ‌తీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి స‌ర‌ఫ‌రా శాఖ‌ల మంత్రి ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్ రావు.

ఈ ఘ‌న‌త సిఎం కెసిఆర్, మంత్రి కెటిఆర్ ల‌దేనని తెలిపారు ‌మంత్రి ఎర్ర‌బెల్లి. ఈ స్వ‌ప్నాన్ని సాకారం చేసిన సిఎంకి, మంత్రి కెటిఆర్ ల‌కు కృత‌జ్ఞ‌త‌లు, ధ‌న్య‌వాదాలు తెలిపారు. 25 ఏండ్ల కింద సిఎం కెసిఆర్ సిద్దిపేట‌లో ప్రారంభించిన మంచినీటి ప‌థ‌క‌మే, మిష‌న్ భ‌గీర‌థ‌ అన్నారు. దేశానికే ఆద‌ర్శంగా నిలిచిన మిష‌న్ భ‌గీర‌థ ప‌థ‌కం…మిష‌న్ భ‌గీర‌థ ప‌థ‌కం ఆద‌ర్శంగా కేంద్రం జ‌ల్ శ‌క్తి ప‌థ‌కాన్ని మొదలు పెట్టిందన్నారు.

ప‌శ్చిమ బెంగాల్, మ‌హారాష్ట్ర స‌హా, అనేక రాష్ట్రాలు మిష‌న్ భ‌గీర‌థ త‌ర‌హాలో త‌మ రాష్ట్రాల్లో ప‌థ‌కాలు మొద‌లు పెట్టారు….మిష‌న్ భ‌గీర‌థ ప‌థ‌కానికి ఇప్ప‌టికే అనేక అవార్డులు, రివార్డులు వచ్చాయన్నారు. ప్ర‌పంచ ఆరోగ్య సంస్థ ప్ర‌మాణాల‌తో స్వ‌చ్ఛ‌మైన శుద్ధి చేసిన, ఆరోగ్య‌వంత‌మైన మంచినీటిని వంద శాతం ప్ర‌జ‌ల‌కు అందిస్తున్నాం అన్నారు.

నూటికి నూరు శాతం ఫ్లోరైడ్ ర‌హిత నీటిని అందిస్తున్న ఘ‌త‌న కూడా మిష‌న్ భ‌గీర‌థ‌దే అన్నారు. అత్యంత వెనుక‌బడిన‌, మారుమూల గ్రామాల‌కు కూడా మంచినీటిని అందిస్తున్నాం…45వేల కోట్లు వెచ్చిస్తున్నాం… ఇందులో 8 వేల కోట్ల‌ని ఆదా చేస్తున్నాం అన్నారు. త్వ‌ర‌లోనే మిష‌న్ భ‌గీర‌థ‌ బాటిల్ నీటిని అన్ని ప్ర‌భుత్వ‌, ప్ర‌జాప్ర‌తినిధుల కార్యాల‌యాల‌కు అంద‌చేయ‌నున్నాం అన్నారు.

గ్రామీణుల‌కు ఒక్కొక్క‌రికి 100 లీట‌ర్లు, ప‌ట్ట‌ణాల ప్ర‌జ‌ల‌కు ఒక్కొక్క‌రికి 135లీటర్లు, న‌గ‌రాల ప్ర‌జ‌ల‌కు ఒక్కొక్క‌రికి 150 లీట‌ర్ల చొప్పున నీటిని అందిస్తున్న రాష్ట్రం కూడా తెలంగాణ మాత్ర‌మేనని చెప్పారు. ప్ర‌జ‌ల‌కు కృష్ణా, గోదావ‌రి న‌దుల ద్వారా భూ ఉప‌రిత‌ల నీటిని అందివ్వ‌డం ద్వారా అత్యంత ఆరోగ్య‌క‌ర‌మైన మంచినీటిని అందిస్తున్న రాష్ట్రం కూడా తెలంగాణే అన్నారు. ఈ శాఖ‌ను నిర్వ‌హిస్తున్నందుకు గ‌ర్వ‌కార‌ణంగా ఉందన్నారు. ఈ అవ‌కాశం క‌ల్పించినందుకు సీఎం కెసిఆర్ గారికి స‌ర్వ‌దా రుణ‌ప‌డి ఉంటానని వెల్లడించారు.