బర్డ్ ఫ్లూ…సరిగా ఉడకని గుడ్లు తినొద్దు:ఫుడ్ సేఫ్టీ ఆఫ్ ఇండియా

61
eggs

బర్డ్ ఫ్లూ మహమ్మారి విస్తరణ నేపథ్యంలో మార్గదర్శకాలు విడుదల చేసింది ఫుడ్ సేఫ్టీ&సెక్యూరిటీ అథారిటీ ఆఫ్ ఇండియా. బర్ద్ ఫ్లూ వైరస్ 70°C వద్ద 3 సెకన్లలో చనిపోతుందని వెల్లడించింది. మాంసం, గుడ్లు 74°C వద్ద ఉడికించినట్లయితే వైరస్ చనిపోతుందని స్పష్టం చేసింది.

ఈ రంగానికి సంబంధించిన ఉత్పత్తులపై ఆధారపడిన వ్యాపారవేత్తలు, వినియోగదారులు భయపడవద్దని ఎఫ్‌ఎస్‌ఎస్‌ఎఐ విజ్ఞప్తి చేసింది. సరైన పద్దతులను అవలంభించాలని సూచించింది. వ్యాపారవేత్తలు, వినియోగదారులకు ఏమి చేయాలో.. ఏమి చేయకూడదనే దాని గురించి మార్గదర్శకాలలో వివరణాత్మక సమాచారాన్ని ఇచ్చింది ఎఫ్‌ఎస్‌ఎస్‌ఎఐ.

ఏమి చేయాలి మరియు ఏమి చేయకూడదో వెల్లడించింది ఫుడ్ సేఫ్టీ&సెక్యూరిటీ అథారిటీ ఆఫ్ ఇండియా. సరిగా ఉడకని గుడ్లు తినకూడదని తెలిపింది.చికెన్ వంట చేసేటప్పుడు మధ్యలో తినకూడదని…బర్డ్ ఫ్లూ సోకిన ప్రాంతాల్లో పక్షులతో ప్రత్యక్ష సంబంధాన్ని నివారించాలని తెలిపింది. చనిపోయిన పక్షులను చేతులతో తాకవద్దని….ముడి మాంసాన్ని ఖాళీ ప్రదేశంలో ఉంచవద్దు.. ప్రత్యక్ష తాకవద్దని తెలిపింది.

ముడి చికెన్ ను ముట్టుకునేప్పుడు మాస్క్, గ్లౌజులు ధరించాలని..పదేపదే చేతులు కడుక్కోవాలని తెలిపింది.ముడి మాంసం ఉంచే సమీప ప్రదేశాలను శుభ్రంగా ఉంచాలి….మంచి, పూర్తిగా ఉడికించిన కోడి మాంసం, గుడ్లు మాత్రమే తినాలని సూచించింది.