Errabelli:ద‌శాబ్ధి ఉత్స‌వాల నిర్వ‌హ‌ణ‌పై స‌మీక్ష‌

58
- Advertisement -

సుదీర్ఘకాలం పోరాటం తర్వాత సాధించుకున్న తెలంగాణ…పదేండ్ల పాలనలో సాధించిన అభివృద్దిని తెలంగాణ పల్లెపల్లెనా గుర్తుచేసుకోవాలని అన్నారు. సీఎం కేసీఆర్ అందిస్తున్న సుపరిపాలన గురించి, రాష్ట్రావతరణ దశాబ్ది ఉత్సవాలను ఓ పండుగలా..ఓ తీపి జ్ఞాపకంగా ఘనంగా నిర్వహించాలని నిర్ణయించారు.

రాష్ట్రావతరణ దశాబ్ది ఉత్సవాలను సీఎం కేసీఆర్ మరిచిపోలేని విధంగా నిర్వహించాలని అదేశించిన సంగతి తెలిసిందే. ఈమేరకు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు డాక్టర్ బీఆర్ అంబేద్కర్‌ సచివాలయంలో ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్విహించారు. ఈ స‌మీక్ష స‌మావేశంలో…స్పెష‌ల్ క‌మిష‌న‌ర్ ప్ర‌సాద్‌, డిప్యూటీ క‌మిష‌న‌ర్ల జాన్ వెస్లీ, రామారావు, ర‌వింద‌ర్‌, మిష‌న్ భ‌గీర‌థ ఇ ఎన్ సి కృపాక‌ర్ రెడ్డి, సెర్ప్ డైరెక్ట‌ర్లు ర‌జిత‌, త‌దిత‌రులు పాల్గొన్నారు.

జూన్‌ 2నుంచి 23వ తేదీ వరకు 21రోజుల పాటు అత్యంత వైభవంగా ఈ ఉత్సవాలు నిర్వహించాలన్నారు. ఇందుకోసం పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి గ్రామీణ మంచినీటి సరఫరా శాఖల అధికారులుకు దిశా నిర్దేశం చేశారు. పండుగ వాతావరణంలో రోజుకో కార్యక్రమం చొప్పున మొత్తం 21రోజులు పాటు తెలంగాణ సాధించిన విజయాలను ప్రజలకు తెలిపేలా నిర్వహించాలని అన్నారు.

పల్లెపల్లెనా దశాబ్ది ఉత్సవాల ఏర్పాట్లు ఘనంగా ఉండాలన్నారు. ప్రతి గ్రామాన్ని ఒక యూనిట్‌గా తీసుకొని ఆయా గ్రామాల్లో 23రోజుల పాటు ప్రణాళిక బద్దంగా కార్యక్రమాలను ఏర్పాటు చేయాలని అన్నారు. గ్రామగ్రామాన గ్రామ సభలు సమావేశాలు ఏర్పాటు చేయాలని సూచించారు. పదేండ్ల కాలంలో సాధించిన ప్రగతిని సవివరంగా వివరించాలని సూచించారు. గ్రామాల్లో పథకాలను వివరించాలన్నారు. గ్రామగ్రామాన ప్రగతి నివేదికల రూపంలో వివరించాలని అన్నారు.

ప్రతి గ్రామాల్లో అభివృద్ధి యొక్క విజయోత్సవ వేడుకలు నిర్వహించలన్నారు. ప్రతి ఇంటి ముందు రంగు రంగుల రంగువల్లులను తీర్చి దిద్దాలని అందుకోసం మహిళలను సంసిద్ధం చేయాలని మంత్రి స్పష్టం చేశారు. తెలంగాణ ఆవిర్భావం తర్వాత మహిళలకు మహిళ సంఘాలు ఎక్కడలేని గుర్తింపు గౌరవం దక్కిందని మంత్రి అన్నారు. స్వయం సహాయక సంఘాల మహిళలను పారిశ్రామికవేత్తలుగా తయారు చేస్తున్నామని అన్నారు. మహిళా సంఘాలు చేస్తున్న ఉత్పత్తులను ప్రదర్శించాలని అన్నారు. ఆయా ఉత్పత్తులను మంచి ఆదరణ కల్పించాలని మంత్రి అధికారులకు చెప్పారు.

గ్రామాల్లో మౌలిక సదుపాయాలపై దండోరా వేయాలని అన్నారు. న‌ర్స‌రీలు, డంపింగ్ యార్డులు, క‌ల్లాలు, రైతు వేదిక‌లు, స్మ‌శాన వాటిక‌లు, ప‌ల్లె ప్ర‌కృతి వ‌నాలు, బృహ‌త్ ప‌ల్లె ప్ర‌కృతి వ‌నాలు, క్రీడా ప్రాంగ‌ణాలు ఏర్పాటు చేశామ‌న్నారు. వాటిపై, అభివృద్ధిపై గ్రామాల్లో దండోరాలు వేసి, ఉత్స‌వాల‌ను నిర్వ‌హించాల‌ని చెప్పారు. అమరవీరుల కుటుంబాలను ఘనంగా సన్మాంచాలని అన్నారు. వారి త్యాగాలను స్మరించుకుంటూ అమర వీరుల స్థూపాలున్న చోట వాటికి లేని చోట కొత్తగా ఏర్పాటు చేసి అమర వీరులకు ఘనంగా నివాళులర్పించాలని అని సూచించారు.

నాడు నేడు ప్రభుత్వ అభివృద్ధిపై డాక్యుమెంటరీలు ఏర్పాటు చేయాలన్నారు. గ‌తంలో ప‌ల్లెలు ఎట్లుండే… ఇప్పుడు ఎలా ఉన్నాయి అన్న విష‌యాలు ప్ర‌జ‌ల‌కు తెలిసేలా, ఫోటో ఎగ్జిబిష‌న్ లు నిర్వ‌హించాల‌ని మంత్రి ఎర్ర‌బెల్లి అధికారుల‌కు తెలిపారు. మిషన్ భగీరథ ద్వారా మంచినీటి పరీక్షలు చేయాలని వాటి నాణ్యత గురించి ప్రజలకు వివరించాలని సూచించారు. కేంద్రప్రభుత్వం అందించిన ఉత్తమ అవార్డులు పొందిన గ్రామాల గురించి వివరించాలన్నారు.

Also Read: CMKCR:దశాబ్దాలు పాలించిన కాంగ్రెస్ చేసింది శూన్యం

అన్ని శాఖలతో సమన్వయంతో పనిచేయాలని అన్నారు. అంతా కలిసికట్టుగా కార్యక్రమాలను నిర్వహించాలన్నారు. స‌ర్పంచ్‌లు, ఎంపీటీసీలు, వార్డు స‌భ్యులు, పంచాయ‌తీ వివిధ అభివృద్ధి క‌మిటీలు, పంచాయ‌తీ కార్య‌ద‌ర్శులు, ప్ర‌జ‌ల‌ను భాగ‌స్వాముల‌ను చేయాలి. ఏ రోజు ఏం చేయాలి? ఎలా చేయాల‌నే దానిపై మార్గ‌ద‌ర్శ‌కాల‌ను సిద్ధం చేయాలి. ఆయా అంశాల‌ను గ్రామ స్థాయిలో అధికారులు, ప్ర‌జాప్ర‌తినిధుల‌కు చేరేలా చేయండి అని మంత్రి ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్ రావు అధికారుల‌ను దిశానిర్దేశం చేశారు.

Also Read: BRS: బి‌ఆర్‌ఎస్ కు ‘నో పోటీ’!

- Advertisement -