స్వచ్ఛంద సేవకు ఇది సరైన సమయం: ఎర్రబెల్లి

131
minister errabelli

స్వచ్ఛంద సేవకు ఇది సరైన సమయం అన్నారు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు. ఉమ్మడి వరంగల్ జిల్లా మేరు సంఘం ఆధ్వర్యంలో పంపిణీ చేస్తున్న మాస్కులను ఆవిష్కరించి పలువురికి అందచేశారు. ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి మాట్లాడుతూ, కరోనా వైరస్ నేపథ్యంలో ప్రజలను ఆదుకోవడానికి ముందుకు వస్తున్న అన్ని సంఘాలు, స్వచ్ఛంద సేవా సంస్థలు, వ్యక్తులకు అభినందనలు తెలిపారు.

ప్రజలకు, ప్రత్యేకించి నిరుపేదలను ఆదుకోవడానికి అంతా ముందుకు రావాలన్నారు. కరోనా వైరస్ కారణంగా మొత్తం ప్రపంచమే స్తభించిందని…ఆర్థిక లావాదేవీలు మాత్రమే కాదు, ప్రజా జీవనం కూడా నిలిచిందన్నారు.

ప్రజలు స్వచ్ఛందంగా లాక్ డౌన్ పాటిస్తున్నారు. దినసరి వేతన జీవులను ఆదుకోవాలన్నారు. అనేక సంస్థలు, సంఘాలు, వ్యక్తులు సీఎం సహాయ నిధికి ఆర్థిక సాయం చేస్తున్నారు..ప్రజలకు మస్కులు పంపిణీ చేయడానికి ముందుకు వచ్చిన మేరు సంఘాన్ని అభినందిస్తున్నానని చెప్పారు.

అసలైన, అవసరం ఉన్న నిరుపేదలకు సాయం అందేలా చూడాలని…ఈ సందర్భంగా పంపిణీ కోసం మంత్రి ఎర్రబెల్లికి 5 వేల మాస్కులని అందచేశారు.