కరోనా ఫండ్స్ కోసం దాయాదుల పోరు…!

169
shoiab

ప్రపంచ దేశాలను కరోనా అతలాకుతలం చేస్తున్న సంగతి తెలిసిందే. కరోనాతో ఇప్పటికే అన్ని అంతర్జాతీయ, దేశీయ టోర్నమెంట్‌లు రద్దయ్యాయి. ఈ నేపథ్యంలో పాక్ మాజీ క్రికెటర్ షోయబ్ అక్తర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

కరోనా విరాళాలు సేకరించడానికి భారత్ × పాక్ మధ్య మూడు మ్యాచ్‌ల సిరీస్ నిర్వహించి విరాళాలు సేకరించాలని సూచించాడు షోయబ్. కరోనా కు వ్యతిరేకంగా ఈ రెండు దేశాలు పోరాడుతున్నాయి. అందువల్ల అభిమానులు లేకుండా దాయాదుల పోరు నిర్వహిస్తే బాగుంటుందని సూచించాడు.

లాక్ డౌన్ కారణంగా ప్రజలు అందరూ ఇంట్లోనే ఉంటారు. కాబట్టి టీవీ వ్యూవర్‌షిప్ బాగా పెరుగుతుంది. అందులో వచ్చిన లాభాన్ని రెండు దేశాలు సమానంగా పంచుకోవాలన్నాడు. ఈ రెండు దేశాలు 2007 నుండి ద్వైపాక్షిక సిరీస్‌ లో తలపడటం లేదు . కేవలం ఐసీసీ టోర్నీల్లో అలాగే ఆసియా కప్ లో మాత్రమే ఈ దేశాలు తలపడుతున్నాయి.