Errabelli:బీఆర్ఎస్ హ్యాట్రిక్ ఖాయం

42
- Advertisement -

రాష్ట్రంలో బీఆర్ఎస్ హ్యాట్రిక్ సాధించడం ఖాయమన్నారు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు. అమెరికాలోని ఫిలడెల్ఫియాలో మూడు రోజులపాటు నిర్వహిస్తున్న తానా మహాసభల్లో భాగంగా మీట్‌ అండ్‌ గ్రీట్‌ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు.

సీఎం కేసీఆర్ నేతృత్వంలో తెలంగాణ అన్ని రంగాల్లో అగ్రగామిగా నిలిచిందన్నారు. రాష్ట్రంలో జరగాల్సిన అభివృద్ధి ఇంకా చాలా ఉందని, దీనికి ఎన్‌ఆర్‌ఐల సహకారం కూడా ఉండాలని చెప్పారు. అభివృద్ధి, సంక్షేమ మహాయజ్ఞంలో మనమంతా భాగస్వాములవుదామని పిలుపునిచ్చారు.

ఊర్లలో 24 గంటల కరెంటు, మంచి నీళ్లు రావడమే దీనికి కారణమని వెల్లడించారు. ఇంతటి అభివృద్ధి కారణమైన సీఎం కేసీఆర్‌ను మనం కాపాడుకోవాలన్నారు.

Also Read:దేశరాజధాని ఢిల్లీలో కుండపోత వర్షాలు..

గత 25 ఏండ్లుగా తాను తానా సభలకు హాజరవుతున్నాని చెప్పారు. ఈసారి మంత్రిగా ఇక్కడికి వచ్చానని తెలిపారు. ఇలా అందరినీ కలవడం, ఒకే కుటుంబంలా గడపడానికి మించిన ఆనందం ఎక్కడా దొరకదన్నారు.

- Advertisement -