కరోనాపై పోరులో విజయం సాధిద్ధాం: మోడీ

106
modi

కరోనాపై పోరులో విజయం సాధిద్ధామని పిలుపునిచ్చారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ. హైడ్రాక్సీక్లోరోక్విన్ పంపిణీ చేయడంపై సంతృప్తివ్యక్తం చేసిన మోడీ భారత్‌కు కృతజ్ఞతలు తెలిపారు.

దీనికి ప్రతిగా స్పందించిన మోడీ… విపత్కర పరిస్థితులే మిత్రులను మరింత దగ్గర చేస్తాయన్నారు. భారత్‌-అమెరికా సంబంధాలు ఇదివరకు ఎన్నడూ లేనంతగా మరింత బలపడుతున్నాయన్నారు. కరోనాపై పోరాటానికి మానవతా దృక్పథంతో భారత్‌ చేయగలిగిన సాయమంతా చేస్తుందని స్పష్టం చేశారు మోడీ.

కరోనా వైరస్‌ను కట్టడి చేసే యాంటి మలేరియా డ్రగ్‌ హైడ్రాక్సీక్లోరోక్వీన్‌ కావాలని అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ భారత్‌ను అడిగిన విషయం తెలిసిందే. తొలుత తిరస్కరించిన తర్వాత పంపిణీ చేసేందుకు అంగీకారం తెలిపారు మోడీ.