మ‌హారాష్ట్ర‌లో క‌రోనా కల్లోలం..

105
corona

మ‌హారాష్ట్ర‌లో క‌రోనా రోజురోజు తీవ్రంగా పెరుగుతోంది. తాజాగా ఈ రోజు కొత్తగా 22,453 మందికి క‌రోనా పాజిటివ్ వ‌చ్చింది. దీంతో ఆ రాష్ట్రంలో న‌మోదైన మొత్తం కేసుల సంఖ్య 10,60,308కి చేరింది. అందులో 7,40,061 మంది వైర‌స్ బారి నుంచి కోలుకున్నారు. మ‌రో 2,90,344 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇక క‌రోనా మ‌ర‌ణాలు కూడా మ‌హారాష్ట్ర‌లో భారీగానే న‌మోద‌వుతున్నాయి. ఆదివారం కొత్తగా 416 మంది క‌రోనా బాధితులు ప్రాణాలు కోల్పోయారు. రాష్ట్రంలో గ‌త వారం రోజుల నుంచి ప్ర‌తి రోజు 20 వేలకు త‌గ్గ‌కుండా కొత్త కేసులు న‌మోదవుతున్నాయని మ‌హారాష్ట్ర ఆరోగ్య‌శాఖ అధికారులు తెలిపారు.