రాష్ట్రంలో రాగల మూడు రోజుల్లో భారీ వర్షాలు..

199
rains

ఈ రోజు బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావం తెలంగాణపై ఉండనుందని హైదరాబాద్ వాతావరణశాఖ తెలిపింది. దీంతో రాష్ట్రంలో రాగల మూడు రోజుల్లో పలు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు హెచ్చరించారు. మరోవైపు ఇప్పటికే హైదరాబాద్ సహా తెలంగాణలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం కూడా అప్రమత్తమైంది. వాతావరణశాఖ సూచనల మేరకు ఎప్పటికప్పుడు జిల్లా అధికారులను ప్రభుత్వం అప్రమత్తం చేస్తోంది.

సోమవారం అదిలాబాద్, కొమురం భీమ్ అసిఫాబాద్, మంచిర్యాల, పెద్దపల్లి, కరీంనగర్, సిద్ధిపేట, భూపాల్ పల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, వరంగల్ రూరల్, వరంగల్ అర్బన్, మహబూబాబాద్, జనగామ, యాదాద్రి భువనగిరి, ఖమ్మం, సూర్యాపేట, నల్లగొండ, మేడ్చల్, హైదరాబాద్ రంగారెడ్డి, నాగర్ కర్నూల్ జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ సమాచారం.