బిగ్ బాస్‌లోకి సాయికుమార్‌..!

313
Bigg Boss Telugu 4

తెలుగు రియాలిటీ షో బిగ్ బాస్ నాలుగో సీజన్ ప్రారంభమైంది.. అంతేకాదు అప్పుడే వారం రోజులను పూర్తి చేసుకుంది. అయితే షో రూల్స్ లో భాగంగా ప్రతీవారం ఒకరు ఎలిమినేట్ అవ్వాల్సిందే. తొలివారం నామినేషన్‌కి సంబంధించి ఏడుగురు నామినేట్ కాగా.. వీరిలో గంగవ్వ, అభిజిత్, సుజాతలు సేఫ్ అయ్యారు. సూర్య కిరణ్, మెహ‌బూబ్‌, అఖిల్‌, దివిలు డేంజర్‌లో జోన్‌‌లో ఉండగా.. వీరిలో దర్శకుడు సూర్య కిరణ్ ఎలిమినేట్ కావడం ఖాయంగానే కనిపిస్తోంది.

అయితే ఆదివారం నాటి ఎపిసోడ్‌లో ఒకరు ఎలిమినేట్ అవడంతో పాటు వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఉండబోతుంది. దీనికి సంబంధించిన ప్రోమోను సర్ ప్రైజ్ చేస్తూ విడుదల చేసింది స్టార్ మా. అయితే బిగ్ బాస్ హౌస్‌లో వైల్డ్ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా రాబోతున్న ఆ కంటెస్టెంట్ ముఖం అయితే చూపించలేదు కాని.. కనిపించీ కనిపించకుండా చూపించిన ఆ కంటెస్టెంట్ కమెడియన్ సాయి కుమార్ పంపన అని తెలుస్తోంది. ఈ రోజుల్లో, బస్ స్టాప్ వంటి చిత్రాలతో కమెడియన్‌గా అలరించిన సాయి కుమార్ బిగ్‌బాస్ షో ద్వారా త‌న అదృష్టాన్ని ప‌రీక్షించుకోనున్నారు.