ప్రపంచంలో అత్యంత చౌకైన రైలు ప్రయాణం భారతదేశలో ఉంది. అలాగే ప్రపంచంలో ఖరీదైన ప్రయాణం కూడా భారతీయ రైల్వే సొంతం. అవును ఇది నిజం…మహారాజా ఎక్స్‌ప్రెస్. ఈ మహారాజాస్‌లో ప్రయాణించాలంటే ఏకంగా రూ. 19లక్షలకు పైగా ఖర్చువుతుందట. ఖర్చు తగ్గట్టుగానే రైలులో వసతులు కూడా రాయల్ లైఫ్ కు ఏమాత్రం తగ్గకుండా ఉంటాయి. ఇందులో ముఖ్యంగా ఆకర్షణ ప్రెసిడెన్షియల్ సూట్. ఇందులో రెండు బెడ్‌రూంలు వీత్ ఆటాచ్ బాత్‌రూంలు ఉంటాయి. లీవింగ్ ఏరియా హాలు డెస్క్‌లు కలిగిఉంటుంది. భారతీయ రైల్వేల్లో మహారాజా ఎక్స్‌ప్రెస్ రైలు వాణిజ్య విభాగం యాజమాన్యంలో నడుస్తుంది.
మహారాజా ఎక్స్‌ప్రెస్ లో ఐదు ప్యాసింజర్లు ఉంటాయి. ఇందులో ఒక్కొక్కటి నాలుగు డీలక్స్ క్యాబిన్‌లు ఏర్పాటు చేయబడ్డాయి. ఒక్కొక్కటి మూడు జూనియర్ సూట్‌లు మరియు ఆరు సెలూన్లు, అలాగే రెండు సూట్‌లలో రెండు సెలూన్ మరియు అత్యంత ఖరీదైన ప్రెసిడెన్షియల్ సూట్ ఉంటాయి.
ఎల్‌సీడీలు మరియు టీవీలు డీవీడీ ప్లేయర్లు డైరెక్ట్ డయల్ టెలిఫోన్ సౌకర్యం కలిగి ఉన్నాయి. ఇంటర్‌నెట్ సౌకర్యం కూడా కల్పించనున్నారు. ఇందులో మరొక విశేషం ప్రతి క్యాబిన్ స్వంత ఎలక్ట్రానిక్ సేఫ్ డిపాజిట్ లాకర్‌లు కూడా అమర్చబడి ఉంటుంది. పబ్లిక్ ఏరియాలో విశాలమైన కిటికీలు కలిగి ఉంటాయి. దీని ద్వారా బయటి ప్రాంతాన్ని ప్రతి అందమైన ప్రదేశాన్ని ఆస్వాదించేలా రూపొందించబడింది.
ఈ ఎక్స్‌ప్రెస్‌లో రెండు రెస్టారెంటులు కలిగి ఉండగా అందులో మయూర్ మహాల్ మరియు రంగ్‌మహాల్. ఒకేసారి 42మంది కూర్చునే సామర్థ్యంతో ఏర్పాటు చేయబడిన ఈ రెస్టారెంట్లు ప్రతి ఒక్కరికి అత్యంత రాయల్ ఫుడ్‌ను అందిస్తుంది. మరియు ఇందులో వైన్స్ కూడా సర్వ్ చేయనున్నారు. ఇందులో రాజా క్లబ్ పేరుతో లాంజ్ కమ్ బార్ కూడా ఉంది. ఇందులో సౌకర్యవంతమైన సీటింగ్‌ను కలిగి కిటికీల గుండా కనిపించే అందమైన ప్రదేశాలను ఆస్వాదించేలా ఏర్పాటు చేశారు.
మహారాజా ఎక్స్‌ప్రెస్‌లు ప్రపంచంలోనే లగ్జరీ రైలుగా గుర్తింపు పొందింది. ఇది వరల్డ్స్ లీడింగ్ లగ్జరీ ట్రైన్ ఆవార్డును వరుసగా ఏడు సార్లు గెలుచుకొంది. ఇది యూకేలోని రాయల్ స్కాట్స్‌మన్ యూరోప్‌లోని ఓరియంట్ ఎక్స్‌ప్రెస్ మరియు బ్లూ ట్రైన్ దక్షిణాఫ్రికా వంటి లగ్జరీ రైల కంటే ముందు వరుసలో నిలిచింది.
ఇవి కూడా చదవండి…