మహేష్ పై స్పెషల్ వీడియో

42
mahesh
- Advertisement -

మహేష్ బాబు, త్రివిక్రమ్ కాంబినేషన్ లో సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. ఈ ప్రాజెక్టు ఎనౌన్స్ మెంట్ తప్ప.. అంతకు మించి ఈ సినిమాకి సంబంధించి ఇప్పటివరకు అధికారికంగా ఎలాంటి అప్ డేట్స్ ఇవ్వలేదు యూనిట్. ఐతే, ఇకపై వరుసపెట్టి అప్ డేట్స్ ఇచ్చేందుకు సితార ఎంటర్ టైన్మెంట్స్ సమాయత్తం అవుతుంది. ఇందులో భాగంగా సినిమా షూటింగ్ తో పాటు ఇతర వివరాల్ని వెల్లడించడం కోసం ప్రత్యేకంగా త్రివిక్రమ్ – మహేష్ విజువల్స్ తో ఓ వీడియోను రిలీజ్ చేయాలనుకుంటున్నారు.

దీని కోసం మహేష్ పై వచ్చే వారం స్పెషల్ గా షూటింగ్ చేసి మరీ ఆ వీడియో విడుదల చేయబోతున్నారు. ఇలా మొదటి నుంచే ప్రాజెక్టుపై అంచనాలు పెంచాలని త్రివిక్రమ్ నిర్ణయించుకున్నారట. ఇంతకుముందు మహేష్ – త్రివిక్రమ్ కాంబోలో అతడు లాంటి బ్లాక్ బస్టర్ వచ్చింది. కానీ, ఖలేజా బాగా నిరాశ పరిచింది. మళ్లీ ఇన్నేళ్లకు ఈ ఇద్దరూ కలిశారు. ఈసారి పాన్ ఇండియా సబ్జెక్ట్ సెలక్ట్ చేసుకున్నారు. అందుకు తగ్గట్టుగానే త్రివిక్రమ్ ఈ సినిమాలో సంజయ్ దత్ ను తీసుకోబోతున్నాడు.

మెయిన్ హీరోయిన్ గా పూజా హెగ్డే నటించబోతుంది. ఇక సెకండ్ లీడ్ లో జాన్వీ కపూర్ ను హీరోయిన్ గా తీసుకున్నారు. తమన్ ఈ సినిమాకు సంగీతం అందించబోతున్నాడు. ఇప్పటికే కొన్ని లొకేషన్లు ఫైనలైజ్ చేశారు. త్వరలోనే రెగ్యులర్ షూట్ తేదీని ప్రకటిస్తారు. మొత్తానికి త్రివిక్రమ్ ఈ సినిమా బెటర్ అవుట్ ఫుట్ కోసం బాగా కష్ట పడుతున్నాడు.

ఇవి కూడా చదవండి…

ప్రభాస్ ఎపిసోడ్ థియేటర్‌లోకి..?

బాలయ్య , పవన్ కలిస్తే ?

పూరి మళ్ళీ మొదలెట్టాడు

- Advertisement -