MODI:ఐదు వందేభారత్ రైళ్లకు పచ్చజెండా

13
- Advertisement -

భారతీయ రైల్వేల్లో అత్యాధునిక సదుపాయాలు కలిగిన సెమీహైస్పీడ్‌ అయిన ఐదు వందే భారత్ రైళ్లను ప్రధాని మోదీ ప్రారంభించారు. మధ్యప్రదేశ్‌ రాజధాని భోపాల్‌లో ప్రధాని మోదీ జెండా ఊపి వీటిని ప్రారంభించారు. పలు రాష్ట్రాల్లోని ముఖ్య నగరాలను అనుసంధానించేలా ఈ రైళ్ల సర్వీసులను అందుబాటులోకి తీసుకొచ్చారు. భోపాల్‌లోని రాణి కమలాపతి రైల్వే స్టేషన్‌కు చేరుకున్న ప్రధాని భోపాల్‌-జబల్‌పూర్‌, ఖజురహో-భోపాల్-ఇండోర్‌, హతియా-పాట్నా, ధార్వాడ్‌-బెంగళూరు, గోవా-ముంబాయిలకు జెండా ఊపి ప్రారంభించారు. ఇందులో రెండు రైళ్లను భౌతికంగా మిగతా వాటిని వర్చువల్‌ ద్వారా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్, మధ్యప్రదేశ్ గవర్నర్ మంగుభాయ్‌ పటేల్‌, రాష్ట్ర సీఎం శివరాజ్‌ సింగ్ చౌహన్‌, కేంద్రమంత్రులు నరేంద్రసింగ్‌ తోమర్‌, జ్యోతిరాదిత్య సింధియా తదితరులు పాల్గొన్నారు.

Also Read: రాహుల్ నాయకత్వంపై డౌటే ?

- Advertisement -