రైలు ప్రయాణం..నోరు జాగ్రత్త

173
- Advertisement -

మీకు దగ్గర్లోనే రైలు ఉందా లేదా రైల్లో ప్రయాణించడం మీకు ఇష్టమా… దేశంలోనే ఏ ప్రాంతానైనా తక్కువ ఖర్చుతో ప్రయాణించాలని మీరు అనుకుంటున్నారా…అయితే మీరు తప్పకుండా ఇవీ పాటించాలి లేదంటే మీకు తప్పడు భారీ మూల్యం. అవునండీ.. మీరు చూస్తున్నది నిజమే…రైలు ప్రయాణికుల కోసం ఇండియన్‌ రైల్వే క్యాటరింగ్‌ అండ్‌ టూరిజం కార్పొరేషన్‌ (ఐఆర్‌సీటీసీ)నూతన మార్గదర్శకాలు జారీ చేసింది. ముఖ్యంగా రాత్రి పూట ప్రయాణించే వారి కోసం ఈ సూచనలను జారీ చేసింది. ఒకవేళ మీరు ఈ నియమాలు పాటించకపోతే జరిమానా విధించనున్నారు.

ఇదిగో ఇవే నియమాలు..

  1. రాత్రి వేళల్లో రైలు బోగీలో ఏ ప్రయాణికుడు కూడా గట్టిగా మాట్లాడరాదు. స్పీకర్‌ పెట్టి పాటలు వినరాదు.
  2. రైల్వే ఎస్కార్టు, మెయింటెనెన్స్‌ స్టాఫ్‌ గట్టిగా అరవరాదు.
  3. రాత్రి 10 తర్వాత టీటీఈ టికెట్‌ను తనిఖీ చేయరాదు.
  4. మిడిల్‌ బెర్త్‌ ప్రయాణికులు వారి బెర్త్‌పై రాత్రి 10 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు ఎలాంటి ఇబ్బంది లేకుండా నిద్రపోవచ్చు.
  5. కుటుంబంలో ఒకరికి సీటు కన్ఫార్మ్‌ అయ్యి, ఇంకొకరికి కాకపోయినా.. కన్ఫార్మ్‌ అయిన వ్యక్తి ప్రయాణించకపోతే ఆ సీటులో టికెట్‌ కన్ఫార్మ్‌ కాని వ్యక్తి ప్రయాణించొచ్చు.
  6. సీటు కేటాయించిన ప్రయాణికులు రాకపోతే, గంట తర్వాత లేదా రెండు స్టేషన్లు దాటాకనే (ఏది ముదు అయితే అది) వేరేవారికి టీటీఈ సీటు కేటాయించాలి.

ఇవి కూడా చదవండి..

రాహుల్‌కు కేటీఆర్ చురకలు..

నిరాడంబరుడు…గుమ్మడి

ఏడాది తర్వాత మోది ప్రభుత్వం కూలుతుంది

 

 

- Advertisement -