2022వ సంవత్సరానికిగాను ప్రపంచంలోని సురక్షితమైన నగరాల జాబితాను బెర్క్‌షైర్ హాత్‌వే కంపెనీ రూపొందించింది. ఇది ప్రపంచంలోని 23నగరాలను టాప్‌లో ఎంపిక చేసింది. అయితే అమెరికన్ ప్రయాణికులను ఈ జాబితాను రూపొందించడానికి ఎక్కువగా అధారపడింది. దీంతో ఆసియా నుంచి 2నగరాలు ఎంపిక జరిగాయి. ఎక్కువగా యూరోప్‌దేశాల నుంచి ఈ జాబితాలో ఎంపిక జరిగిందని తెలిపింది. ఇది ఎక్కువగా నేర సూచిక మరియు ఆర్థిక కార్యాకలపాలును ఆధారంగా చేసుకొని నంబియో ఈ రేటింగ్ ప్రకటించింది.
మాంట్రియల్ (కెనడా) 78.7/100
కెనడా దేశంలోని మాంట్రియల్ నగరం మొదటి స్థానంలో ఉంది. ఇందులో ఎల్‌జీబీటీక్యూ+వ్యక్తులకు భద్రతా పరంగా మొదటి స్థానంలో ఉందని తెలిపింది. మాంట్రియల్ నగరం ఎక్కువగా ఫ్రెంచ్ మాట్లాడే ప్రాంతంలో ఉండటంతో ఇది అత్యంత ప్రాధాన్యత కలిగిన నగరంగా పేర్కొంది. ఇక్కడ అందమైన వాటర్ ఫ్రంట్ మరియు ఇతర ప్రాంతాలకు వెళ్లగలిగేలా కాలినడకకు అనువైన రోడ్లు ఉండటం మరియు ప్రజారవాణాకు అత్యంత ఉపయోగకరమైన నగరంగా ఉండటం వల్లే మొదటి స్థానంలో ఉందని వెల్లడించింది.
ఆమ్‌స్టర్ డ్యామ్ (నెదర్లాండ్స్) 75.6/100
భద్రతా రవాణా పరంగా చూస్తే మాంట్రియల్‌తో సమానంగా ఉందని తెలిపింది. తీవ్రవాదం చాలా తక్కువగా ఉందని ఎల్‌జీబీటీక్యూ+వ్యక్తులకు అత్యంత అనువైన నగరంగా పేరుగాంచింది. ఈ విషయంలో మాంట్రియల్‌తో సమానమైన ర్యాంకింగ్‌ను సొంతం చేసుకొంది.
టోక్యో (జపాన్) 73.8/100
టోక్యో నగరం పరిశ్రుభ్రత మరియ భద్రతకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చిందని తెలిపింది. ఆసియాలోనే సురక్షితమైన నగరంగా పేరుగాంచిందన్నారు. ఎల్‌జీబీటీక్యూ+కమ్యూనీటీకి అత్యంత అనువైన నగరంగా పేరుగాంచింది. కోవిడ్ 19 కేసులు చాలా తక్కువ సంఖ్యలో నమోదైంది. మరియు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడంతో ఈ నగరం టాప్‌లో నిలిచిందని బెర్క్‌షైర్ హాత్వే తెలిపింది.
సింగపూర్ 72.6/100
ప్రపంచంలో అత్యంత సురక్షితమైన నగరాల్లో సింగపూర్ ఒకటని బెర్క్‌షైర్ తెలిపింది. ఇక్కడ చట్టాలను తప్పనిసరిగా అనుసరించడం మరియు వాటి పట్ల అంకితభావంతో ఉండటం వల్లే ఇది సాధ్యమైందని తెలిపింది. అత్యంత పోలీస్ంగ్ వ్యవస్థ కలిగిఉందని తెలిపింది.
లండన్ (యూకే) 65.5/100
లండన్ నగరంలో ప్రాథమిక స్వేచ్ఛను మరియు గౌరవంగా జీవించే హక్కులను కలిగిఉందని ప్రకటించింది. మరియు ఆరోగ్య రంగంలో మెరుగైన ఫలితాలు ఏర్పరచుకోవాలని ప్రయాణికులు వెల్లడించారు. ఇక్కడ కేవలం వ్యక్తి స్వేచ్ఛగా జీవించే అవకాశం ఉందని అందుకే ఇది ఐదో స్థానంలో ఉందని తెలిపింది.
బార్సిలోనా (స్పెయిన్) 65.5/100
ఇక్కడ లక్సరీ లైఫ్ ఉంటుందని వెల్లడించింది. ఇక్కడికి ఎక్కువగా ఉన్నతాదాయ వర్గ ప్రజలు ఈ నగరంను ఎంపిక చేసుకున్నారని తెలిపింది.
హాంకాంగ్ 65.0/100
ఆసియాలోనే రెండవ సురక్షితమైన నగరంగా పేరుగాంచింది. ఇది టోక్యోను కూడా వెనక్కి నెట్టింది. ఇక్కడ చైనా యొక్క పరిపాలనా ఉండటం వల్ల ఇది సురక్షితమైన నగరంగా ఉందని బెర్క్‌షైర్ తెలిపింది.
బెర్లిన్ (జర్మనీ) 64.5/100
జర్మనీ రాజధాని అయిన బెర్లిన్ పర్యటకులకు అత్యంత ప్రాధాన్యత ఉంటుందని వారికి వ్యక్తిగత స్వేచ్ఛలకు ఎటువంటి భంగం కలిగించకుండా ఉంటారని తెలిపింది. ఇక్కడ వైద్య సౌకర్యాలు ఇంకాస్త మెరుగు పడాల్సిన అవసరం ఉందని తెలిపింది.
రోమ్ (ఇటలీ) 64.5/100
రోమ్‌లో ఎల్‌జీబీటీక్యూ+కమ్యూనీటీకి అత్యంత అనువైన నగరం కాదని తెలిపింది. మరియు ఆరోగ్య చర్యలు అతంత మాత్రమేనని పేర్కొంది. ఎక్కువగా కరోనా వల్ల పూర్తిగా వ్యవస్థ దెబ్బతిందని పేర్కొంది. ఇక్కడి ప్రజల కంటే పర్యాటకుల భద్రత ఎక్కువగా ప్రాధాన్యత ఉంటుందని తెలిపింది. అయితే వీటిన్నంటిని మెరుగుపరుచుకొంటే నాలగవ స్థానంలో ఉండేదని తెలిపింది.
సిడ్నీ (ఆస్ట్రేలియా) 62.1/100
ఆస్ట్రేలియా దేశంలోనే సిడ్నీ సురక్షితమైన నగరమని తెలిపింది. ఇది సింగపూర్ కంటే కేవలం 10పాయింట్లు మాత్రమే తక్కువగా ఉందని తెలిపింది. ఆరోగ్య చర్యల్లో మిగిలిన నగరాల కంటే తక్కువ స్కోర్ సాధించిన…రంగు మరియు హింస్మాత్మక నేరాల్లో విషయంలో సిడ్నీ నగరం మిగిలిన నగరాల కంటే మెరగైందని బెర్క్‌షైర్ ప్రకటించింది. మరియు ఎల్‌జీబీటీక్యూ+కమ్యూనీటీకి అత్యంత అనువైన నగరం కాదని తెలిపింది.
ఇవి కూడా చదవండి…
ఎగరలేని పక్షుల జాబితా…
భారీగా తగ్గిన బంగారం ధరలు..
పుదీనాతో లాభాలు..

