లవ్ స్టోరీ..ఫస్ట్ డే వసూళ్లు ఎంతో తెలుసా..?

37
love story

శేఖర్ కమ్ముల దర్శకత్వంలో నాగచైతన్య, సాయిపల్లవి జంటగా నటించిన చిత్రం లవ్ స్టోరీ. భారీ అంచనాల మధ్య రిలీజ్ అయిన ఈ మూవీ అంచనాలకు తగ్గట్టుగానే పాజిటివ్ టాక్‌తో దూసుకుపోతోంది.

దీంతో కలెక్షన్లలో జోరు చూపిస్తోంది లవ్ స్టోరీ. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో థియేట్రికల్ రన్ తో రూ. 6.5-రూ. 7.5 కోట్ల మధ్య షేర్ వసూలు చేసింది. ప్రపంచవ్యాప్తంగా మొదటి రోజు రూ.8 కోట్లకు పైగా వసూళ్లు సాధించినట్టు సమాచారం.

రెండు తెలుగు రాష్ట్రాల్లో “లవ్ స్టోరీ” ప్రీ-రిలీజ్ బిజినెస్‌ రూ .26.3 కోట్లు కాగా ఈ సినిమా బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ .32 కోట్లు. వారాంతంలో ఈ సినిమా మంచి కలెక్షన్లు రాబట్టే అవకాశం ఉంది.