హాలీవుడ్ రేంజ్‌లో సలార్..!

62
prabhas

కేజీఎఫ్ ఫేమ్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న చిత్రం సలార్. హోంబలే ఫిలింస్ బ్యానర్‌పై విజయ్ కిరగందూర్ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. 2022 ఏప్రిల్ 14న ఈ మూవీని ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

పాన్ ఇండియన్ మూవీగా వస్తున్న ఈ సినిమాను హాలీవుడ్ టెక్నాలజీతో రూపొందిస్తున్నారట. హాలీవుడ్‌లో రూపొందిన ‘మ్యాట్రిక్స్’ ‘బ్యాట్ మ్యాన్’ లాంటి చిత్రాలకు ఉపయోగించిన టెక్నాలజీతో ‘సలార్’ చిత్రాన్ని కూడా రూపొందిస్తున్నారట.

సినిమా షూటింగ్ ముంబైలో శరవేగంగా జరుగుతుండగా ప్రభాస్ సరసన శృతి హాసన్ హీరోయిన్‌గా నటిస్తోంది.