తెలుగు తెరపై మరో వినూత్న చిత్రం !

148
- Advertisement -

విభిన్నమైన కథ కథనాలతో సహజత్వానికి దగ్గరగా ఉండే చిత్రాలు ఎప్పుడూ విజయాలు సాధిస్తాయి. ఇప్పుడు ‘@లవ్’ అనే సినిమా కూడా అలాంటి కోవకు చెందింది అని టాక్ నడుస్తోంది. ఈ సినిమాలో కంటెంట్ చాలా వైవిధ్యంగా ఉందని.. మరో వినూత్న సినిమాగా నిలుస్తోందని తెలుస్తోంది. శ్రీ నారాయణ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో ఫస్ట్ లుక్ ను టాలెంటెడ్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ లాంచ్ చేసిన సంగతి తెలిసిందే. గిరిజన నేపథ్యంలో స్వచ్ఛమైన ప్రేమ కథతో రాబోతున్న ఈ సినిమా తనను ఎంతగానో ఆకట్టుకుందని..నాగ్ అశ్విన్ చెప్పారు.

‘మంచి సినిమా రావడం లేదు అని బాధ పడేవారికి ఈ సినిమా మంచి ఆప్షన్. గొప్ప కథకు ఆసక్తికరమైన కథనానికి స్టార్స్ అక్కర్లేదు అని నిరూపించే సినిమా ఇది అంటూ నాగ్ అశ్విన్ చెప్పుకొచ్చారు. అలాగే ఈ సినిమా చూసిన పలువురు సినీ ప్రముఖులు దర్శకుడు శ్రీ నారాయణ ప్రతిభను మెచ్చుకుంటున్నారు. రక్తమాంసాలు ఉన్న పాత్రల తాలూకు గొప్ప జర్నీని ఈ సినిమాలో శ్రీ నారాయణ చూపించిన విధానం అద్భుతంగా ఉందట.

ముఖ్యంగా ఈ @లవ్ చిత్రంలో ప్రతి పాత్రకు ఒక కథ ఉందని.. ప్రతి పాత్రకు ఓ ఎమోషన్ ఉందని.. ప్రతి ఎమోషన్ కథను డ్రైవ్ చేస్తోందని చెబుతున్నారు. అసలు ఇలాంటి ప్రేమ కథలో అద్భుతమైన ఎమోషన్స్ ను పెట్టడం నిజంగా అద్భుతం. మొత్తానికి ట్రైబల్ బ్యాక్ డ్రాప్ లో రాబోతున్న ఈ చిత్రం ఓ కొత్త అనుభూతిని పంచుతుందట. ఇక ఈ చిత్రాన్ని TMS బ్యానర్ తో ప్రీతమ్ ఆర్ట్స్ &SN క్రియేషన్స్ సంయుక్తంగా మహేందర్ సింగ్, శైలజ తాటిచెర్ల మరియు శ్రీనారాయణ నిర్మించారు. డిసెంబర్ లో రానున్న ఈ @లవ్ ప్రేక్షకులను ఆకర్షించే చిత్రంగా నిలిచే ఛాన్స్ ఉంది.

ఇవి కూడా చదవండి..

- Advertisement -