‘ఆహా’లో నాగ చైతన్య ‘లవ్ స్టోరి’..

164
Love Story
- Advertisement -

దర్శకుడు శేఖర్ కమ్ముల డైరెక్షన్‌లో అక్కినేని వారసుడు నాగ చైతన్య, సాయి పల్లవి ప్రధాన పాత్రల్లో హైదరాబాద్ నేపథ్యంగా “లవ్ స్టోరి” పేరుతో ఓ సినిమా వస్తున్న సంగతి తెలిసిందే. ఈ మూవీపై భారీ అంచనాలే ఉన్నాయి. అయితే కరోనా సెకండ్ వేవ్ లేకుంటే ఏప్రిల్ 16నే ఈ చిత్రం విడుదల కావాల్సింది. ఇప్పుడు మళ్లీ థియేటర్లు తెరుచుకుని పూర్తి స్థాయిలో నడిచే సమయానికి ‘లవ్ స్టోరి’ వచ్చేస్తుంది.

థియేట్రికల్ రిలీజ్ తర్వాత ఈ చిత్రాన్ని ‘ఆహా’లోకి తీసుకురానున్నారు. ఈ విషయాన్ని ఆహా అధికారికంగానే ప్రకటించింది. దీంతో పాటు గీతా ఆర్ట్స్ బేనర్లో తెరకెక్కుతున్న అఖిల్ మూవీ ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’.. నాగశౌర్య చిత్రం ‘లక్ష్య’ డిజిటల్ హక్కులను ఆహానే సొంతం చేసుకుంది. ఈ చిత్రాల వరుస చూస్తుంటే ఆహా మరో స్థాయికి వెళ్తున్నట్లే కనిపిస్తోంది.

- Advertisement -