మా ఎన్నికల్లో పోటీ నాన్నకు ఇష్టంలేదు: విష్ణు

50
vishnu

తాను మా ఎన్నికల్లో పోటీ చేయడం నాన్న మోహన్ బాబుకు ఇష్టం లేదని తెలిపారు మంచు విష్ణు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన విష్ణు..మా ప్రెసిడెంట్ అనేది ట్యాగ్ కాదు, బాధ్యత. నేను దానిని సమర్ధవంతంగా నిర్వహించగలనని నమ్మకం ఉందన్నారు.

నాన్న మోహన్ బాబు 46 సంవత్సరాలుగా పరిశ్రమలో ఉన్నారు… ఇన్నేళ్ళలో పరిశ్రమను విభజించడాన్ని ఎప్పుడూ చూడలేదు అని విష్ణు పేర్కొన్నారు. 2015లోనే మా ఎన్నికల్లో పోటీచేయాలని భావించానని కానీ నాన్న ఒప్పుకోలేదన్నారు.

నా చేతిలో కొన్ని సినిమాలు ఉన్నాయి… పైగా అనుభవం లేదు. ఇప్పుడు నేను ‘మా’లో చాలా మార్పును తీసుకురాగలనని నమ్మకంగా చెప్పగలను అని విష్ణు అన్నారు.