సీజేఐ ఎన్వీ రమణకు ఘనస్వాగతం పలికిన కేటీఆర్..

18
ktr

భారత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్వీ రమణ శంషాబాద్‌ ఎయిర్‌పోర్టుకు చేరుకున్నారు. సీజేఐ హోదాలో ఎన్వీ రమణ తొలిసారిగా హైదరాబాద్‌కు వచ్చారు. ఎయిర్‌పోర్టులో ఎన్వీ రమణకు తెలంగాణ హైకోర్టు చీఫ్‌ జస్టిస్‌ హిమా కోహ్లీ, మంత్రులు కేటీఆర్‌, మహమూద్‌ అలీ, సబితా ఇంద్రారెడ్డి, పువ్వాడ అజయ్‌, ఎమ్మెల్యేలు, సీఎస్‌ సోమేశ్‌ కుమార్‌, డీజీపీ మహేందర్‌ రెడ్డి, ఉన్నతాధికారులు ఘన స్వాగతం పలికారు. ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణ ఎయిర్‌పోర్టు నుంచి నేరుగా రాజ్‌భవన్‌కు చేరుకుంటారు.

ఈ స్వాగత కార్యక్రమంలో మంత్రులు మహమూద్ అలీ, పువ్వాడ అజయ్, సబితా ఇంద్రారెడ్డి, ఇంద్రకరణ్ రెడ్డి, తలసాని, ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్ కుమార్, మేయర్ విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్ మోతే శ్రీలత, డీజీపీ మహేందర్ రెడ్డి, ఎమ్మెల్యేలు మాగంటి గోపినాద్, అరికెపూడి గాంధీ, జీవన్ రెడ్డి, ప్రకాష్ గౌడ్, ముఠా గోపాల్, నల్లమోతు భాస్కర్ రావు, కోనేరు కోనప్ప, ఎమ్మెల్సీలు శ్రీనివాస్ రెడ్డి, మల్లేషం తదితరులు పాల్గొన్నారు.