పవార్‌తో ప్రశాంత్​ కిషోర్ కీలక​ భేటీ..

26
Prashant Kishor

ఎన్సీపీ చీఫ్ శ‌ర‌ద్ ప‌వార్‌ను రాజ‌కీయ‌, ఎన్నిక‌ల వ్యూహ‌క‌ర్త ప్ర‌శాంత్ కిషోర్ శుక్ర‌వారం ముంబైలోని ప‌వార్ నివాసంలో భేటీ అయ్యారు. పవార్‌ ఇంట్లో ఆయనతో కలసి ప్రశాంత్ భోజనం చేశారు. వీరిద్ద‌రి మ‌ధ్య భేటీపై రాజ‌కీయ వ‌ర్గాల్లో ప‌లు ఊహాగానాలు సాగుతున్నాయి. పాల‌క బీజేపీని 2024 పార్ల‌మెంట్ ఎన్నిక‌ల్లో, 2022లో జ‌రిగే యూపీ ఎన్నిక‌ల్లో మ‌ట్టిక‌రిపించేందుకు విప‌క్షాలు కూట‌మిగా జ‌ట్టుక‌డ‌తాయ‌నే అంచ‌నాల మ‌ధ్య ప‌వార్, ప్ర‌శాంత్ కిషోర్ భేటీ ప్రాధాన్య‌త సంత‌రించుకుంది.

అయితే బెంగాల్, తమిళనాడుల్లో విజయానికి సహకరించినందుకు కృతజ్ఞతపూర్వకంగానే ఆయన కలిశారని ఆయన సన్నిహితులు చెబుతున్నారు. శరద్ పవార్ ఒక్కరినే కాకుండా.. ఇటీవలి ఎన్నికలలో మమత బెనర్జీ, ఎంకే స్టాలిన్ లకు మద్దతు ప్రకటించిన ప్రతి ఒక్కరిని ఆయన కలుస్తారని అంటున్నారు. అయితే, కృతజ్ఞతలు తెలపడంతో పాటు ‘మిషన్ 2024’కూ ఇప్పటి నుంచే ప్రణాళికలు రచిస్తున్నారన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ప్రధాని నరేంద్ర మోదీకి దీటుగా పోటీకి నిలబెట్టేందుకు ‘కూటమి’ ప్రధాని అభ్యర్థి గురించి కూడా మాట్లాడుతున్నట్టు తెలుస్తోంది.