స్వల్ప స్కోరుకే వికెట్లు కోల్పోయిన కోల్‌కతా..

86
Kolkata

ఐపీఎల్ టోర్నీలో ఇవాళ 24వ మ్యాచ్ జరుగుతోంది. కింగ్స్ ఎలెవెన్ పంజాబ్ , కోల్‌కతా నైట్ రైడర్స్ జట్లు తలపడుతున్నాయి. టాస్ గెలిచిన కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టు బ్యాటింగ్‌కు ఎంచుకుంది. ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్‌ చేస్తోన్న కోల్‌కతా నైటరైడర్స్‌(కేకేఆర్‌)కు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. 12 పరుగుల వద్ద రాహుల్‌ త్రిపాఠి ఔటయ్యాడు. మహ్మద్‌ షమీ వేసిన మూడో ఓవర్లో రాహుల్‌ బౌల్డయ్యాడు.మరోవైపు, అర్షదీప్‌ సింగ్‌ వేసిన తర్వాతి ఓవర్‌లో నితీశ్‌ రాణా అనూహ్యంగా రనౌటయ్యాడు. స్వల్ప స్కోరుకే రెండు వికెట్లు కోల్పోవడంతో కోల్‌కతాపై ఒత్తిడి పెరిగింది. 10 ఓవర్లకు కోల్‌కతా రెండు వికెట్ల నష్టానికి 60 పరుగులు చేసింది. మోర్గాన్‌(5), శుభ్‌మన్‌(13) క్రీజులో ఉన్నారు.