టాస్ గెలిచిన కోల్‌కతా నైట్ రైడర్స్..

136
KKR vs KXIP
- Advertisement -

అబుదాబిలోని షేక్ జాయెద్ స్టేడియంలో ఐపీఎల్ టోర్నీలో ఇవాళ 24వ మ్యాచ్ జరుగుతోంది. కింగ్స్ ఎలెవెన్ పంజాబ్ , కోల్‌కతా నైట్ రైడర్స్ జట్లు తలపడుతున్నాయి. టాస్ గెలిచిన కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టు బ్యాటింగ్‌కు ఎంచుకుంది. ఇరు జట్లలో ఒకే ఒక్క మార్పు చేశారు. పంజాబ్ జట్టులోకి జోర్డాన్ వచ్చాడు. ఈ మ్యాచ్‌లో పేసర్ కాట్రెల్‌ను పక్కనబెట్టారు. ఇక కేకేఆర్ జట్టులో శివం మావి స్థానంలో ప్రసిద్ధ్ క్రిష్ణ జట్టులోకి వచ్చాడు.

కోల్‌కతా నైట్ రైడర్స్: రాహుల్ త్రిపాఠి, శుభమాన్ గిల్, నితీష్ రానా, సునీల్ నరైన్, ఇయాన్ మోర్గాన్, అండ్రూ రస్సెల్, దినేష్ కార్తీక్ (కెప్టెన్ అండ్ వికెట్ కీపర్), ప్యాట్ కమిన్స్, కమలేష్ నాగర్‌కోటి, ప్రసిద్ధ్ క్రిష్ణ, వరుణ్ చక్రవర్తి.

కింగ్స్ ఎలెవెన్ పంజాబ్: కేఎల్ రాహుల్ (కెప్టెన్), మయాంగ్ అగర్వాల్, మన్‌దీప్ సింగ్, నికోలస్ పూరన్, సిమ్రాన్ సింగ్ ( వికెట్ కీపర్), గ్లెన్ మాక్స్‌వెల్, ముజీవ్ రహమాన్, క్రిస్ జోర్డాన్, రవి బిష్ణోయ్, మహమ్మద్ షమీ, అర్షదీప్ సింగ్.

- Advertisement -