ఢిల్లీపై కోల్‌క‌తా గెలుపు..

78

ఐపీఎల్ 2021లో భాగాంగా.. షార్జా వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్ తో జరిగిన మ్యాచ్‌లో కోల్‌క‌తా ఘ‌న విజ‌యం సాధించింది. 128 ప‌రుగుల ల‌క్ష్యంతో బ‌రిలోకి దిగిన కోల్‌క‌తా 3 వికెట్ల తేడాతో ఢిల్లీని ఓడించింది. మొద‌ట టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఢిల్లీ క్యాపిటల్స్‌.. ప‌రుగులు చేయ‌డంలో విఫ‌ల‌మైంది. స్టీవెన్ స్మిత్ (39), రిష‌బ్ పంత్ (39) ఫ‌ర్వాలేద‌నిపించారు. శిఖ‌ర్ ధ‌వ‌న్ కూడా 24 ప‌రుగుల‌కే ఔట‌య్యాడు.

ఇక మిగిలిన ప్లేయ‌ర్లు అంతా విఫ‌ల‌మ‌య్యారు. త‌క్కువ ప‌రుగుల‌కే అవుట్‌ కావడంతో నిర్ణీత 20 ఓవ‌ర్లు ముగిసేస‌రికి ఢిల్లీ కేవ‌లం 127 ప‌రుగులు మాత్ర‌మే చేయ‌గ‌లిగింది. అనంత‌రం స్వ‌ల్ప ల‌క్ష్యంతో చేజింగ్‌కు దిగిన కోల్‌క‌తా ఇంకా 10 బంతులు మిగిలి ఉండగానే లక్ష్యాన్ని ఛేదించింది.