గ్రీన్ ఛాలెంజ్ స్వీకరించి మొక్కలు నాటిన సజ్జన్ సింగ్..

48

రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా సిక్కు హెరిటేజ్ ఫౌండేషన్ కన్వీనర్ సజ్జన్ సింగ్ మొక్కలు నాటారు. ఫోరమ్ ఫర్ ఏ బెటర్ హైదరాబాద్ చైర్మన్ మణికొండ వేదకుమార్ విసిరిన ఈ ఛాలెంజ్ స్వీకరించి ఉస్మానియా జనరల్ ఆసుపత్రి ఆవరణలోని అఫ్జల్ పార్క్‌లో సజ్జన్ సింగ్ మొక్కలు నాటడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమంలో ప్రతి ఒక్కరినీ బాగస్వామ్యం చేస్తున్న ఎంపీ సంతోష్ కుమార్‌కి అభినందనలు తెలియజేశారు.

ఈ కార్యక్రమం మరింత ముందుకు వెళ్లేందుకు SGPC అమృత్ సర్ మాజీ కార్యదర్శి సర్దార్ రూప్ సింగ్,అమృత్ సర్ ఖల్సా కాలేజ్ ఫైనాన్స్ సెక్రెటరీ గున్బీర్ సింగ్,సింగ్ సాహిబ్ జ్యోతిందర్ సింగ్,సుచంద్ హజూర్ సాహిబ్ హెడ్ గ్రంధి,సింగ్ సాహిబ్ అవతార్ సింగ్ శీతల్, మాజీ పాంగ్‌ప్యారా నాందేడ్ లకు గ్రీన్ ఇండియా ఛాలెంజ్ విసిరారు.