పంజాబ్‌పై కోల్‌కతా అద్భుత విజయం..

166
kkr
- Advertisement -

దుబాయ్ వేదికగా ఐపీఎల్‌-13లో కింగ్స్‌ లెవెన్‌ పంజాబ్‌ మరోమరు తడబడింది. పంజాబ్‌తో ఉత్కంఠభరితంగా సాగిన పోరులో కోల్‌కతా నైట్‌రైడర్స్‌ అద్భుత విజయాన్ని సొంతం చేసుకున్నది. పంజాబ్ 2 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. 165 పరుగుల విజయలక్ష్యంతో బరిలో దిగిన పంజాబ్ కు ఓపెనర్లు కేఎల్ రాహుల్ (74), మయాంక్ అగర్వాల్ (56) తొలివికెట్ కు 14.2 ఓవర్లలో 115 పరుగులు జోడించి శుభారంభం అందించారు. ఈ పార్ట్ నర్ షిప్ చూస్తే పంజాబ్ ఓడిపోతుందని ఎవరూ అనుకుని ఉండరు.

అయితే, కోల్ కతా బౌలర్ ప్రసిధ్ కృష్ణ ఎంతో ప్రభావవంతంగా బౌలింగ్ చేసి మూడు వికెట్లతో పంజాబ్ ను దెబ్బకొట్టాడు. చివరి ఓవర్ లో 14 పరుగులు అవసరం కాగా,పంజాబ్ జట్టు 12 పరుగులు చేసి ఓటమి పాలైంది. ఆఖరి బంతికి సిక్స్ కొట్టాల్సిన స్థితిలో నరైన్ వేసిన బందిని మ్యాక్స్ వెల్ భారీ షాట్ కొట్టినా అది సరిగ్గా బౌండరీ లైన్ ముందు పడడంతో ఫోర్ మాత్రమే వచ్చింది. దాంతో పంజాబ్ శిబిరంలో నిరాశ నెలకొనగా, ఓడిపోయే మ్యాచ్ లో గెలుపును చేజిక్కించుకున్న కోల్ కతా ఆటగాళ్లలో ఆనందం వెల్లివిరిసింది.

అంతకుముందు యువ ఓపెనర్‌ శుభ్‌మన్‌ గిల్‌(57: 47 బంతుల్లో 5ఫోర్లు), కెప్టెన్‌ దినేశ్‌ కార్తీక్‌(58: 29 బంతుల్లో 8ఫోర్లు, 2సిక్సర్లు) అర్ధశతకాలతో రాణించడంతో కోల్‌కతా 20 ఓవర్లలో 6 వికెట్లకు 164 పరుగులు చేసింది. పంజాబ్‌ బౌలర్లలో అర్షదీప్‌ సింగ్‌(1/25), రవి బిష్ణోయ్‌(1/25), మహ్మద్‌ షమీ(1/30) కోల్‌కతా బ్యాట్స్‌మెన్‌ను కట్టడి చేశారు.

ఐపీఎల్ 2020 సీజన్‌లో పంజాబ్‌కు ఇది వరుగా ఐదో ఓటమి. ఇప్పటి వరకు 7 మ్యాచ్‌లు ఆడిన కేఎల్ రాహుల్ సేన.. కేవలం ఒకే ఒక్క మ్యాచ్ గెలిచింది. కేవలం బెంగళూరు జట్టుపై మాత్రమే విజయం సాధించింది. కోల్‌కతా, ఢిల్లీ, రాజస్థాన్, ముంబై, చెన్నై, హైదరాబాద్ జట్ల చేతిలో పరాజయం పాలైంది.

- Advertisement -