టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న కేకేఆర్..

22
KKR

ఐపీఎల్ 2021లో భాగంగా చెన్నై సూపర్ కింగ్స్ – కోల్‌కతా నైట్‌రైటర్స్ మధ్య అబుదాబిలో మ్యాచ్ జరుగుతున్నది. టాస్ గెలిచిన కోల్‌కతా కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ బ్యాటింగ్ చేయడానికి నిర్ణయించుకున్నాడు. ఈ మ్యాచ్ కోసం చెన్నై జట్టులో ఓ మార్పు చేశారు. డ్వేన్ బ్రావో స్థానంలో శామ్ కరన్ ను తుది జట్టులోకి తీసుకున్నామని కెప్టెన్ ధోనీ వెల్లడించాడు. అదే సమయంలో, కోల్ కతా జట్టులో ఎలాంటి మార్పులు లేవని ఆ జట్టు కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ టాస్ సందర్భంగా తెలిపాడు.