నేటి రోజుల్లో పొట్ట చుట్టూ కొవ్వును కరిగించడం చాలమందికి ఒక సవాల్ గా మారింది. ఎందుకంటే మారుతున్న ఆహారపు అలవాట్ల కారణంగా, జంక్ పుడ్ ఎక్కువగా తినడం వల్ల.. ఇంకా చెప్పాలంటే ఎక్కువసేపు కూర్చొని పని చేయడం వల్ల పొట్ట చుట్టూ కొవ్వు పెరుకుపోతుంది. ఈ కొవ్వును కరిగించడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నప్పటికి సరైన ఫలితం మాత్రం కనిపించదు. అయితే యోగాలో ” కటిచక్రాసనం ” ద్వారా పొట్ట చుట్టూ పెరుకుపోయిన కొవ్వును ఇట్టే కరిగించవచ్చు. అందువల్ల ఈ ఆసనం వేయు విధానం మరియు ఈ ఆసనం వేయడం వల్ల కలిగే లాభాల గురించి తెలుసుకుందాం !
కటిచక్రాసనం వేయు విధానం
ముందుగా రెండు పదాలను దగ్గరగా ఉంచుకొని నిటారుగా నిలబడాలి. ఆ తరువాత రెండు పదాలను మెల్లగా అడుగు దూరంలో లేదా ఒకటిన్నర అడుగు దూరంలో ఉంచి రెండు చేతులను ముందుకు చాచి, చేతులు సమాంతరంగా ఉండేలా చూచుకోవాలి. ఆ తరువాత కుడి చేతిని ఎడమ భుజంపై ఉంచి.. ఎడమ చేతిని కుడి నడుముపై వెనుకగా కొద్దిగా పట్టుకొని ఉండేటట్లుగా ఫోటోలో చూపినట్లుగా చేయవలెను. ఈ స్థితిలో ఉన్నప్పుడే నడుము ను మెల్లగా త్రిప్పవలెను. అలాగే తలను మెల్లగా ఎడమ భుజం వైపునకు తిరిగి ఉన్నట్లుగా ఉంచవలెను. నడుమును త్రిపెట్టప్పుడు కాళ్ళను కదల్చకుండా స్థిరంగా ఉంచవలెను. ఈ చేసే సమయంలో శ్వాస క్రియ నెమ్మదిగా జరిగించవలెను. ఇలా 10-30 సేకన్లు యధాస్థితికి వచ్చి మరలా కుడి వైపు కూడా అదే విధంగా చేయవలెను.
ఉపయోగాలు
ఈ ఆసనం వేయడంవల్ల పొట్ట చుట్టూ పెరుకుపోయిన కొవ్వు ఇట్టే కరిగిపోతుంది. అంతే కాకుండా వెన్నెముక ఫ్లెక్సిబిలిటీ పెరుగుతుంది. ఇక ఆర్థరైటిస్ సమస్యలు ఉన్నవాళ్ళు ఈ ఆసనం వేస్తే ఎంతో మంచిది అని యోగా నిపుణులు చెబుతున్నారు.
జాగ్రత్తలు
మెడనొప్పి, భుజం, నడుము నొప్పి అధికంగా ఉన్నవాళ్ళు ఈ ఆసనం వేయకపోవడం మంచిది.
Also Read:KTR:కాంగ్రెస్‌పై ఈడీ మౌనం ఎందుకు?