కీరదోసతో ప్రయోజనాలెన్నో..!

83
- Advertisement -

నీటి శాతం అధికంగా ఉండే కీరదోస ను సాధారణంగా వేసవిలో ఎక్కువగా తింటూ ఉంటారు. దీనిని వివిధ సలాడ్ లలోనూ, జ్యూస్ లలోనూ ఉపయోగిస్తూ ఉంటారు. కీరదోసలో ఎన్నో రకాల పోషకాలు పుష్కలంగా ఉంటాయి. అందువల్ల దీనిని తినడం వల్ల ఎన్నో ఆరోగ్య సమస్యలు దూరమవుతాయి. ఇందులో మెగ్నీషియం, జింక్, ఫాస్పరస్, ఐరన్ వంటి పోషకాలు అధికంగా ఉంటాయి. వీటివల్ల చలికాలంలో తరచూ వేదించే జలుబు, ముక్కు దిబ్బడ, గొంతు నొప్పి వంటి సమస్యల నుంచి త్వరగా బయట పడవచ్చట. ముఖ్యంగా చలి కాలంలో చాలామంది మూత్ర సంబంధిత సమస్యలతో బాధపడుతూ ఉంటారు. కొందరికి మూత్రంలో మంట, అధిక మూత్రం, వంటి సమస్యలు వేధిస్తూ ఉంటాయి. వీటికి కీరదోస చక్కటి పరిష్కారంగా ఉంటుదని ఆహార నిపుణులు చెబుతున్నారు. ఇంకా రక్త ప్రసరణలో ను మెరుగు పరిచి శరీర భాగాలన్నిటికి రక్త ప్రసరణ సవ్యంగా జరిగేలా చూడడంలో కూడా కీరదోస లోని పోషకాలు ఉపయోగ పడతాయట. .

వేసవిలో వీటిని తినడం వల్ల డీహైడ్రేషన్ బారి నుంచి బయట పడవచ్చు. కానీ చలికాలంలో వీటిని తినడం శరీరంలో నీటి శాతాన్ని సమతుల్య పరచడంతో పాటు మెదడు పని తీరును కూడా మెరుగుపరుస్తుందట. ఇందులో ఉండే విటమిన్ బి చలికాలంలో తరచూ వేధించే తలనొప్పిను దూరం చేస్తుందట. ఇంకా చాలమందికి చలికాలంలో మలబద్ధకం సమస్య ఎక్కువగా వేధిస్తుందట. అలాంటి వారు తప్పనిసరిగా కీరదోస తినడం వల్ల మలబద్ధకం దూరం కావడంతో పాటు జీర్ణ వ్యవస్థ కూడా మెరుగుపడుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఇంకా షుగర్ వ్యాధి గ్రస్తులకు రక్తంలో చక్కెర శాతాన్ని తగ్గించడంలో కూడా కీరదోస ముఖ్య పాత్ర పోషిస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. కాబట్టి ఇన్ని ఉపయోగాలు ఉన్న కీరదోసను కేవలం వేసవిలో మాత్రమే కాకుండా చలికాలంలో కూడా తినడం వల్ల ఎంతో మేలని నిపుణులు చెబుతున్న మాట.

Also Read:ఫ్యామిలీ ఆడియన్స్‌కి నచ్చే..ఫ్యామిలీ స్టార్

- Advertisement -